తెలుగువాడి దమ్ముని, ప్రపంచానికి చాటిచెప్పిన విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ పద్మశ్రీ, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పై కేంద్రంలో కదలిక వచ్చింది.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఎన్నో ఏళ్ళ నుంచి, చంద్రబాబు కేంద్రానికి విన్నవిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లోనూ తీర్మానం కూడా చేసి పంపారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఎంపీ కేశినేని నాని జులై 19న లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 377 నిబంధన కింద ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు. దీని పై కేంద్రం స్పందించింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను పీఎంవోకు పంపినట్లు ఎంపీ కేశినేని నానికి హోంశాఖ సమాచారం అందించింది.

భార‌త‌ర‌త్న ఎవ‌రికి ఇవ్వాల‌న్న విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీదే చివ‌రి నిర్ణ‌య‌మ‌ని కేంద్ర హోం శాఖ ప్ర‌క‌టించింది. తెలుగుదేశం ఎలాగూ కేంద్రంలో భాగస్వామి కాబట్టి, అన్నగారికి భారతరత్న ఇచ్చే అవకాశాలే ఎక్కువున్నాయి అంటున్నారు పరిశీలకులు...

Advertisements