11 సిబీఐ కేసులు, 5 ఐడీ కేసుల్లో A2 గా ఉండి, 16 నెలలు జైలు జీవితం అనుభవించి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, నీతులు చెప్తున్న విజయసాయి రెడ్డి కేసుల పై సిబిఐ ఉచ్చు బిగిస్తుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పబ్లిక్‌ సర్వెంట్‌ పరిధిలోకే వస్తారని సీబీఐ తెలిపింది. ఈ కేసును విచారించే పరిధి సీబీఐ కోర్టుకు ఉందని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, రాంకీ కేసుల్లో నిందితులు దాఖలు చేసుకున్న డిశ్ఛార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. సీబీఐ తరఫున కె.సురేందర్‌ వాదనలు ఇలా వినిపించారు.

vijaysi 28072018

‘‘ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి సిఫార్సులతో ఓబీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. అవినీతి నిరోధక చట్టం కింద బ్యాంకు డైరెక్టర్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ పరిధిలోకే వస్తారు’’ అని వివరించారు. వాన్‌పిక్‌ కేసులో సీబీఐ వాదనల నిమిత్తం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం విచారణకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్‌లు వై.శ్రీలక్ష్మి, మన్మోహన్‌సింగ్‌, వెంకట్రామిరెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

Advertisements