విజయవాడకు ఎయిర్‌పోర్టుకు, మరో అత్యుత్తమమైన గుర్తింపు లభించింది.. ప్రయాణికులకు సౌకర్యాలు, సదుపాయాలు, సేవలు నాణ్యంగా అందిస్తున్నందుకు అత్యుత్తమమైన ఐఎ్‌సవో- 9001/2015 ప్రమాణాన్ని సాధించింది. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌ (ఐఎ్‌సఓ) సంస్థ తాజాగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఈ మేరకు ఐఎస్ వో - 9001 ప్రామాణికతను కల్పిస్తూ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావుకు సర్టిఫికెట్‌ను అందించింది... గత నెలరోజులుగా క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (క్యూఎంఎస్‌) విధానంలో విజయవాడ ఎయిర్‌పోర్టు అందిస్తున్న సేవలను ఈ సంస్థకు చెందిన బృందాలు విజయవాడ ఎయిర్‌పోర్టును అధ్యయనం చేశాయి. ..

vijayawada airport 03042018

ప్రయాణికులకు అందించే అన్ని సేవలపై ఈ బృందాలు దృష్టి సారించాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు లేకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వాటన్నింటిని ఎంత నాణ్యతగా అందిస్తున్నారో పరిశీలించటం జరిగింది. ఇప్పటికే టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించి జాతీయస్థాయి అవార్డును సాధించింది. టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి వచ్చే వారికి ప్రయాణ పరంగా అందించే సేవలు సంతృప్తికర స్థాయిలో ఉండే విధంగా ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టు అధికారులు అనేక చర్యలు చేపట్టారు. విశాలమైన ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌లో సకల సదుపాయాలు, సేవలను నాణ్యతతో అందించటం జరుగుతోంది.

vijayawada airport 03042018

ఒక విమానయాన సంస్థకు చెందిన కౌంటర్లు నిర్ణీత సమయంలో ఉపయోగించలేకపోతే అప్పుడే సర్వీసును ప్రారంభించే మరో ఎయిర్‌లైన్స్‌ సంస్థ చెక్‌ ఇన్‌ కౌంటర్లను ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసిన క్యూట్‌ ఫెసిలిటీ సత్ఫలితాలను ఇస్తోంది. సీతా అనే ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా చెక్‌ ఇన్‌ కౌంటర్స్‌ నిర్వహణ జరుగుతోంది. ప్రయాణికులు ఎక్కువ సేపు క్యూలైన్లలో నుంచోకుండా ఉండటానికి సెల్ఫ్ చెకిన్‌ పాయింట్లను ఏర్పాటు చేయించటం జరిగింది. హ్యాండ్‌ బ్యాగులకు ట్యాగ్‌ విధానాన్ని రద్దు చేసేందుకు ట్యాగ్‌లెస్‌ కాన్సె్‌ప్టను తీసుకు వచ్చారు. సీసీ కెమెరాల ద్వారా బ్యాగేజీని ఐడెంటిఫికేషన్‌ చేసే వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్స్‌ రే బ్యాగేజీ మెషీన్లు, హ్యాండ్‌ బ్యాగేజీ స్కానింగ్‌ మెషీన్లను అవసరాల కంటే ఎక్కువుగానే సంసిద్ధం చేశారు. రూ. 2 కోట్ల వ్యయంతో ఆరు ఎక్స్‌రే బ్యాగేజీ స్కాన్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. టెర్మినల్‌ బిల్డింగ్‌ నుంచి రన్‌వే మీదకు వెళ్ళే వరకు వివిధ సేవలను, సదుపాయాలను, నిర్వహణను ఎంతో నైపుణ్యవంతంగా అందిస్తున్నందుకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు అత్యున్నత ప్రమాణం ఐఎస్ వో - 9001 దక్కింది.

Advertisements