ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వ్యక్తి కోసం, ఏకంగా ఒక ప్రభుత్వం ఆర్డినెన్స్ జరీ చేసింది. ఒక వ్యక్తి కోసం ఆర్డినెన్స్ ఏంటి అనుకుంటున్నారా ? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా ? ఆయనే జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి. జగన్ కు అత్యంత సన్నిహితుడు, అన్నిట్లో నెంబర్ 2 అయిన విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి కోసమే ఒక ఆర్దినన్స్ జారీ అయ్యింది. అది కూడా ఆయన పదవి కాపాడటం కోసం. ఆ ఆర్దినన్స్ ప్రజాప్రతినిధుల అనర్హత చట్ట సవరణకు సంబంధించింది. ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి లాభదాయక పదవుల పరిధిలోకి రాదని ఆర్డినెన్స్‌ జారీ అయ్యింది. దీంతో తెలుగుదేశం పార్టీ చెప్తునట్టు విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి అనర్హుడిగా అవ్వటం కూడా కాదు, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కూడా అర్హుడు అవుతారు. జూన్ నెలలో ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా, లాభదాయక పదవుల పరిధిలోకి ఆ పదవి వస్తుందని, ఎంపీగా ఉంటూ ఈ పదవి తీసుకోకూడదు అని, రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.

అయితే అప్పటికే విజ‌య‌సాయిరెడ్డి ఆ ప‌ద‌విలో 13 రోజులు ఉన్నారు. 13 రోజుల పాటు లాబధాయక పదవిలో ఉంటూ, రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన ఉండటంతో, ఆయ‌న‌ ఎంపీ పదవి పై అన‌ర్హ‌త వేటు వేయాలని, తెలుగుదేశం పార్టీ కోరింది. ఈ నేపధ్యంలో, విజయసాయి రెడ్డి ఎంపీ పదవి ఎక్కడ పోతుందో అని భయపడి, ముందుగానే ఒక ఆర్దినన్స్ తీసుకోవచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసి మ‌రీ అనుకున్న పదవిలో విజయసాయి రెడ్డిని మళ్ళీ కూర్చోబెట్టె ప్రయత్నం జరుగుతుంది. ఒక వ్యక్తి పదవి కోసం, ఏకంగా చట్ట సవరణ చెయ్యటం బహుసా ఇదే మొదటి సారి ఏమో. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, విజయసాయి రెడ్డి అనర్హత పై పోరాటం కంటిన్యూ చేస్తామని చెప్తుంది. ఆర్దినన్స్ ఇప్పుడు వచ్చినా, మొన్నటి వరకు అది లేదని, అప్పటికే విజయసాయి రెడ్డి 13 రోజుల పాటు, ఆ పదవిలో ఉన్నారని, ఆయన తప్పకుండా అనర్హత వేటుకు గురవుతరాని, దీని కోసం పోరాడతామని టిడిపి అంటుంది.

Advertisements