గడపగడపకు కార్యక్రమాల్లో, వైసిపి నేతలను  ప్రజలు రోజుకొక చోట చెడుగుడు ఆడుకుంటున్నారు. నిన్న కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్‍ గడప గడప కార్యక్రమం లో పాల్గొన్నారు. మాత్రి విశ్వరూప్ కు ఓ మహిళ చుక్కలు చూపించింది. కోనసీమలో జరిగిన  అల్లర్ల విషయంలో  తన కొడుకుని అక్రమంగా  అరెస్ట్ చేయించారని మంత్రిని నిలదీసింది. దాని వల్ల తన కొడుకు ఉద్యోగం పోయిందంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది.  ఎందుకు తన కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మంత్రిని నిలదీసింది.  మీ వైసీపీ జెండాలు మోసినందుకే తన కొడుక్కి ఇలాంటి కష్టం  వచ్చిందంటూ, వెంటనే  తమ కుటుంబానికి  న్యాయం చేయాలంటూ వైసిపి మంత్రి విశ్వరూప్ని ఆ మహిళా గట్టిగా నిలదీసింది...

Advertisements