విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చింది. రాష్ట్రపతి సూచన మేరకు, ఎలక్షన్ కమిషన్, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం గురించి, తన అభిప్రాయం తెలపనుంది. అయితే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం, అంత తేలికగా పోతుందా ? హలో విజయ్ గారు అంటూ ఆప్యాయంగా పలకించే, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా గారి ఆశీస్సులతో రాజకీయం నడుపుతున్న విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఏమిటి అనేది, మరో రెండు, మూడు రోజుల్లో తెలిసిపోతుంది. లేకపోతే ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్ ప్రకారం వెళ్తే, విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుంది ? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అసలు విషయానికి వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, విజయసాయి రెడ్డికి ఉన్న ఎంపీ పదవితో పాటు, అనేక పదవులు ఇచ్చారు. అందులో ఒకటి, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా.

ec 03092019 2

అయితే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న పదవి, ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ పదవి కింద వస్తుంది. ఎంపీగా ఉంటూ, ఇలా ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ పదవి కింద ఉండ కూడదు. అలా ఉంటే, ఆయన రాజ్యసభకు అనర్హుడు అవుతారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, జూన్ 22న, విజయసాయి రెడ్డిని, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా పదవి ఇచ్చారు. అయితే, ఇది ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కింద వస్తుందని, తెలుగుదేశం గొడవ చెయ్యటంతో, జూలై 4న ఆ ఉత్తర్వులు రద్దు చేసారు. అప్పటికే విజయసాయి రెడ్డి 13 రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి కోసం, రూల్స్ అన్నీ మార్చేసి, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న పదవి , ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కింద రాదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

ec 03092019 3

దీని ప్రకారం మళ్ళీ జూలై 6న , విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, అప్పటికే విజయసాయి రెడ్డి 13 రోజులుగా ఆ పదవిలో ఉన్నారని, అందుకే ఆయన్ను రాజ్యసభకు అనర్హుడిగా ప్రకటించాలని, తెలుగుదేశం పార్టీ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి ఇప్పుడు ఆ ఫిర్యాదుని పరిశీలించమని, ఎలక్షన్ కమిషన్ కు పంపించారు. అయితే దీని పై విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, నేను ఆ 13 రోజులు పదవిలో లేను అని, అసలు నేను ఆ చార్జ్ తీసుకోలేదు అని, ఈ విషయం పై నేను కూడా ఎలక్షన్ కమిషన్ ను క్లారిటీ అడుగుతున్నాను అని, చెప్పుకొచ్చారు. మొత్తానికి, ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవి ఉంటుందో లేదో, ఎలక్షన్ కమిషన్ మరికొద్ది రోజుల్లో చెప్పనుంది.

Advertisements