గత కొన్ని నెలలుగా, కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్ - 2017కు త్వరలో మోక్షం లభించనుంది అంటూ వార్తలువ్ అస్తున్నాయి. ఈ బిల్ అన్ని కీలక దశలు దాటుకొని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) వద్దకు చేరుకుంది. ప్రధాని ఆమోదిస్తే కాని, రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి బిల్ ఆమోదం పొందదు. ఇదంతా లాంఛనప్రాయమేనని అధికార వర్గాలు చెప్తున్నా, ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితిలో మోడీ, ఈ బిల్ ను ఆమోదిస్తారా లేదా అనేది సస్పెన్స్ లో పడింది. యూపీఏ సర్కారు చివరి దశలో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూములను సేకరించడం దాదాపు అసాధ్యంగా మారింది.

ap bill 13052018

దీంతో అనేక రాష్ట్రాలు దానికి సవరణలు తీసుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2017లో ఈ చట్టాన్ని సవరించింది. ఈ బిల్లును గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అంతకు ముందే గుజరాత్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా సొంతంగా భూసేకరణ బిల్లులు రూపొందించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాయి. అవన్నీ 2016లో కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌లోని అంశాలతోనే రూపొందాయి. ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేసి భూములను కోల్పోయిన రైతులకు రెట్టింపు పరిహారం వంటి అంశాలను జోడించింది. ఇప్పటిదాకా గుజరాత్‌, తెలంగాణ బిల్లులే రాష్ట్రపతి ఆమోదం పొందాయి. వీటిని కేంద్ర వ్యవసాయ శాఖతో సంబంధం లేకుండా నేరుగా హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది. పీఎంవో ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేశారు.

ap bill 13052018

ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల బిల్లులను అలా కాకుండా నేరుగా కేంద్ర వ్యవసాయ శాఖ పరిశీలనకు పంపించారు. ఏపీ బిల్లులో సామాజిక ప్రభావ అంచనా, ఆహార భద్రత వంటి అంశాలను పట్టించుకోలేదని పెండింగ్‌లో పెట్టారు. ఇదే అంశంపై గత నెల 12న ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, రెవెన్యూశాఖ ఓఎ్‌సడీ రామ్‌ప్రసాద్‌లు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సత్యపాల్‌ చౌహాన్‌తో చర్చలు జరిపారు. ఈ భేటీకి కేంద్ర వ్యవసాయ, న్యాయ శాఖల అధికారులను కూడా పిలిపించారు. ఈ భేటీలో ఏపీ ప్రతినిధులు తన వాదనలను గట్టిగా వినిపించారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లోని క్లాజులనే తాము చేర్చామని, ఇదే పంథాలో రూపొందించిన గుజరాత్‌, తెలంగాణ బిల్లులను ఆమోదించి తమది నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఈ బిల్లును అంగీకరించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ, హోం శాఖ ఒప్పుకొన్నాయి.

Advertisements