ఒక ముఖ్యమంత్రి పదేపదే కేంద్రాన్ని అడుక్కోవాలా? నాకేంటీ పరిస్థితి? ఒక మనిషిని చంపేసి క్షమాపణలు అడిగితే తప్పు మాఫీ అయిపోతుందా? దేశంలో ముఖ్యమంత్రిగా ఎవరికీ లేని ఇబ్బంది నాకే ఎందుకు కలిగిస్తున్నారు ? ముఖ్యమంత్రిగా ఉన్న తాను పదేపదే ఢిల్లీ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వేరే రాష్ట్రాలకు లేని శిక్ష ఒక్క ఏపీకే ఎందుకు ? ఏపీకి ఏమిస్తున్నారో చెప్పలేదు, విభజన తరువాత రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో వివరించలేదు.
ఇది నిన్న ప్రధానమంత్రిని కలిసి వచ్చాక చంద్రబాబు చెప్పిన మాటలు...రాష్ట్ర ప్రజలుగా ఒక ముఖ్యమంత్రి అలా బాధపడటం చూసి, కేంద్ర చేస్తున్న అన్యాయం చూసి, మనలో చాలా మంది, ఎందుకు చంద్రబాబుకు ఇంత సహనం, ఓర్పు...బయటకు వచ్చేసి, BJPని విమర్శించవచ్చు కదా అని అంటున్నాం...అలా వచ్చేస్తే మన ఇగో satisfy అవ్వుద్ది కాని, మన రాష్ట్ర కష్టాలు తీరవు కదా, కేంద్రం చేసే ఆ సహాయం కుడా చెయ్యకపోతే, కష్టాలు ఇంకా ఎక్కువ అవ్వుతాయి...
అనువు గాని చోట అధికులమనరాదు అంటారు పెద్దలు...ఇది చంద్రబాబుకి బాగా తెలుసు...రాష్ట్రానికి ఉన్న బలహీనతలు, కేంద్రానికి ఉన్న బలం ఆయనికి తెలుసు...ఆయన చేతిలో 33000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు భవిష్యత్తు ఉంది....పర్యావరణ అనుమతులు, అటవీ భూమి డి-నోటిఫై, విదేశీ పెట్టుబడులు, నిధులు, ఇలా అన్నిట్లో కేంద్ర సహకారం అవసరం....ఏమాత్రం తేడా వచ్చినా, మన కలల అమరావతికి దెబ్బ పడుద్ది...33000 ఎకరాలు ఇచ్చిన రైతులు భవిష్యత్తు ప్రస్నార్ధకం అవుతుంది....ఇకపోతే పోలవరం, ఇది పూర్తీ అయితే, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది...దీనికి కేంద్రమే డబ్బులు ఇవ్వాలి....ఇంత సఖ్యతగా ఉంటేనే, విదులుస్తున్నారు, మరి బయటికి వచ్చేస్తే ?
అలా అని చూస్తూ కుర్చోవలా ? ఇప్పటికి రెండు ఏళ్ళు అయిపోయింది...ఇంకా ఎంత కాలం ? ఇన్ని ప్రశ్నలు సామాన్య జనాలవి....మరి ఇంత సుదీర్గ అనుభవం ఉన్న చంద్రబాబుకి జనం నాడి తెలియదా అంటే ? తెలుసు...ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమి చేస్తే ఎవ్వరు లైన్ లోకి వస్తారో ఆయనికి బాగా తెలుసు...అయన రాజకీయ ప్రస్థానం చెప్పుతున్నది అదే...ప్లాన్ A ఫెయిల్ అయితే, ప్లాన్ B రెడీ గా ఉంటది.....ఆయన్ని జనాలు ఎంచుకున్నది కుడా, ఆ అనుభవానికే, ఆ సహననికే, ఆ చానిక్యతకే...దెబ్బ పడితే, కర్రా విరగకూడదు, పాము చావ కూడదు...ప్లాన్ B కుడా ఫెయిల్ అయితే,, మన ఆంధ్రుల సత్తా ఉంది, కష్టపడే తత్వం ఉంది, తెలివి తేటలు ఉన్నాయి....అన్నిటికీ మించి కష్టపడే నాయకుడు ఉన్నాడు...అవే మనల్ని స్వర్ణాంధ్ర వైపు నడిపిస్తాయి....
ప్రస్తుతం డిఫిన్సేవ్ ప్లే ఆడుతున్న చంద్రబాబు, అగ్గ్రేస్సివ్ ప్లే ఆడాలని ప్రతి ఒక్క ఆంధ్రుడి కోరిక...అగ్గ్రేస్సివ్ ప్లే చివ్వర్లో ఆడాలి, మధ్యలో ఆడి వికెట్ పోగుట్టుకుంటే, అసలకే మోసం వస్తుంది....
{youtube}1DyQzGuQnaU|500|250|1{/youtube}