అన్ని న్యూస్ పేపర్లు వైట్ కలర్లో ఉంటే, బిజినెస్ న్యూస్ పేపర్లన్నీ సాల్మన్ పింక్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? దానికి చరిత్రలో రెండు కారణాలు ఉన్నాయి...ఈ స్టొరీ చదవండి...
‘ద ఫైనాన్షియల్ టైమ్స్’అనే బిజినెస్ న్యూస్ పేపర్ 1888లో లండన్‌లో ప్రారంభమైంది. కొత్తలో చాలా కొద్దిమంది రీడర్స్ ఉండేవారు అంట. అప్పుడు యాజమాన్యానికి ఒక ఐడియా వచ్చింది. ఎన్ని పేపర్ల మధ్యనున్నా దానిని చటుక్కున గుర్తించడానికి వీలుగా, విభిన్నంగా కనిపించడానికి 1893 నుంచి పేపర్‌ను సాల్మన్ పింక్ కలర్‌లో ముద్రించడం ప్రారంభించారు. అప్పటి నుంచి దానికి సర్క్యులేషన్ పెరిగింది.
దానితో పాటు, పేపర్‌కు తెల్లరంగు డై వెయ్యడం కంటే గులాబీ రంగు వేయడానికి చాలా తక్కువ ఖర్చయ్యేది. అలా ఒక సంప్రదాయంగా స్థిరపడి, బిజినెస్ పేపర్లన్నీ పింక్ కలర్‌లోనే ముద్రిస్తున్నారు.