ravi sriram 31032016

దివంగత పరిటాల రవీంద్ర అంటే రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. అనంతపురం జిల్లా ప్రజలకి పరిచయం అక్కర్లేదు. చాలా మందికి రవి ఒక ఫ్యాక్షనిస్ట్ గానే తెలుసు. కాని అయన చేసిన సామజిక కార్యక్రమాలు ఏ రాయలసీమ నేత చెయ్యలేదు అంటే అతిశయోక్తి కాదు. రాయలసీమ కరువుతో అల్లాడుతూ, పిల్లల పెళ్లిళ్లు చేయడం తల్లిదండ్రులకు కనాకష్టంగా మారింది. ఆ తరుణంలో పరిటాల రవీంద్ర హయాంలో పేదలకు ఉచిత సామూహిక వివాహాలు చేపించేవారు. ఇప్పుడు అయన పోయనాక కుడా, అయన తనయుడు శ్రీరామ్‌, తల్లి పరిటాల సునీత సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ గొడవల్లో తలమున్కలై ఉన్న సమయంలో కూడా పేదల కోసం ఉచిత సామూహిక వివాహాలను ఆట్టహాసంగా చేయిస్తూనే ఉండేవారు. కాని పరిటాల రవీంద్ర హత్యా తరువాత కొంతకాలం ఈ సంప్రదాయానికి బ్రేక్‌పడింది. మళ్ళి ఇప్పుడు, పరిటాల ట్రస్ట్ ద్వారా ఉచిత సామూహిక వివాహాలను జరిపించడానికి పరిటాల శ్రీరామ్‌ ముందుకొచ్చారు. ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ సామూహిక వివాహాలకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు.

ఒక్కో జంటకు పదివేల రూపాయల ఖర్చుతో చీర, తాళిబొట్టు, ఇతర సామాగ్రిని పరిటాల శ్రీరామ్‌ సమకూర్చుతున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చినా భోజన ఏర్పాట్లకు లోటురానివ్వరట.

ఎంతైనా ఫ్యాక్షన్ పక్కన పెట్టి, ఇలా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలి అనుకోవటంలో ప్రజలు శ్రీరామ్ ని అభినందిస్తున్నారు. అలాగే రాజకీయంగా కూడా శ్రీరామ్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారట

{youtube}bQZBXXIPV1U|500|250|1{/youtube}

Advertisements

అప్పుడు పరిటాల రవి... నేడు పరిటాల శ్రీరామ్‌... ఒకే వ్యూహం Last Updated: 31 March 2016