kodali nani 08042016

కృష్ణాజిల్లా గుడివాడ  నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ప్రస్తుతం కృష్ణాజిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ మారాడు. మళ్లీ సొంత గూటి  వైపు కొడాలి నాని చూస్తున్నారని జరుగుతున్న ప్రచారం అప్పుడే తెలుగుదేశంలో సంచలనం రేపుతుంది. నాని 2014 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.అంతకముందు తెలుగుదేశం పార్టీ తరుపున పోటి చేసి 2004 , 2009 ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత వైఎస్ఆర్ సిపి లో జాయిన్ అయ్యి 2014 ఎన్నికల్లో మూడవసారి కూడా గెలుపొందారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తెలుగుదేశం పార్టీలో కొనసాగినట్లైతే.. ఈ రోజు తూర్పు కృష్ణాలో తిరుగులేని నాయకుడిగా ఉండేవారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి ఎన్టీఆర్ కుటుంబంతో ముఖ్యంగా నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. పరిస్థితులు ఏం ప్రేరేపించాయో తెలియదు కాని ఆకస్మాత్తుగా కొడాలి నాని 2014 ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. అయన వెళ్ళే టప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నార చంద్రబాబు నాయుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసిపి లో చెరక ముందే జగన్ ని చంచల్ గూడ జైలు లో కలిసారు. అయితే కొడాలి నాని పార్టీ మారడం జూనియర్ ఎన్టిఆర్ కి కూడా తల నొప్పులు తెచ్చి పెట్టింది. అప్పట్నుంచి తెలుగుదేశం పార్టీకి కొడాలి నానికి మధ్య కృష్ణా జిల్లాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. పార్టీ కార్యాలయం ఖాళి చేఇంచే విషయం లో కూడా పెద్ద వివాదమే జరిగింది.

ఈ మద్య అసలు వార్తల్లో లేని నాని ఒక్కసారిగా బెజవాడలో రాజకీయ వేడి పుట్టించారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ కారులో ఎన్టీఆర్ సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాల ప్రారంభోత్సవానికి ఎంట్రీ ఇవ్వటంతో మీడియా ఫోకస్ నానిపైకి వెళ్లింది. ఇంకేముంది నాని తెలుగుదేశంలోకి వస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది లేదంటూ నాని చెప్పినప్పటికీ, కాదు కాదు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని, దేవినేని ఉమ, బొండా ఉమ, మంత్రి అచ్చెన్నాయుడుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇంకా తెలుగుదేశం పార్టీ నేతలు మరిచిపోలేదని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.నాని ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నేతతో హైద్రాబాద్ లో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగానే తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై చర్చ ప్రారంభమైంది. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల్సిందేనని ఆ నేత బలంగా కోరుకుంటున్నారు.

కొడాలి నాని తెలుగుదేశం పార్టీలోకి వెళితేనే బాగుంటుందని ఆయన అనుచరవర్గం బలంగా కోరుకుంటోంది...వారు ఎంతగా అభిలషిస్తున్నా... తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం నాని చేసిన విమర్శలను పదే పదే గుర్తు చేస్తున్నారు. ఏకంగా చంద్రబాబుపైనే నాని వ్యక్తిగత విమర్శలు చేశారు. అవి అప్పట్లో చంద్రబాబును కూడా తీవ్రంగా బాధించాయి.. దూకుడు మనస్తత్వం, నోటి దురుసు.. రెండు కూడా నానికి రాజకీయంగా క్రేజ్ ను సంపాదించి పెట్టగా....రెండోవైపు అదే స్థాయిలో నష్టాన్ని కూడా తెచ్చిపెట్టాయి. అనుచరవర్గం తెలుగుదేశంలోకి వెళ్లాలని బలంగా కోరుతుండగా, వచ్చేందుకు మాత్రం తెలుగుదేశం నేతలు ససేమిరా అంటున్నారు. విచిత్ర పరిస్థితుల్లో గుడివాడ నాలుగు రోడ్ల కూడలిలో నాని నిలబడిపోయారు. అందుకే రాజకీయ నాయకులకు మాట పెదవి దాటకూడదంటారు. పెదవి దాటని మాట మన సొంతం.. పెదవి దాటిన మాట ప్రజల్లో వెళుతోంది. అదే శాపమై మారుతుంది. చూద్దాం మరి కొడాలి నాని ఇప్పుడేమి చేస్తాడో ...

Advertisements

తెలుగుదేశంలోకి కొడాలి నాని ...... Last Updated: 08 April 2016