ఎప్పటినుంచో నియోజకవర్గాల పెంపు పై ఒక క్లారిటీ వచ్చేసినట్టే వుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వున్న 175 స్థానాలను 225 స్థానాలకు పెంచే అవకాశం వుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశ పెట్టె అవకాశం వుంది.2 0 1 9 నాటికి 225 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం వుంది. ప్రతి 2.19 లక్షల జనాభా కి ఒక నియోజక వర్గం ఏర్పాటు. గుంటూరు లో కొత్త గా మరో 5 నియోజక వర్గాలు ఏర్పాటు కానున్నాయి. అందులో గుంటూరు సెంట్రల్, పిడుగురాళ్ళ, పెదకాకాని, చెరుకుపల్లి, నకరికల్లు వున్నాయి. ఇప్పటికే 17 నియోజక వర్గాలు వున్న గుంటూరు జిల్లా లో కొత్త గా ఏర్పడే 5 నియోజకవర్గాలతో కలిపి 22 నియోజక వర్గాలు అవనున్నాయి. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో భాగం గా అప్పటివరకు వున్న 19 నియోజక వర్గాలను 17 కి కుదించారు. దుగ్గిరాల,కూచినపూడి నియోజకవర్గాలను రద్దు చేశారు.
అప్పటి వరకు జనరల్ గా వున్న ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వు అయ్యింది. త్వరలో మారనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో లోక్ సభ సీట్ల స్వరూపమే మారిపోయే అవకాశం వుంది. ఒక్కో లోక్ సభ స్థానం లో 9 అసెంబ్లీ నియోజక వర్గాలు వుండే విధం గా పునర్విభజన చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో లోక్ సభ స్థానానికి 7 అసెంబ్లీ నియోజక వర్గాలు వున్నాయి. కొత్త గా ఏర్పడే 5 నియోజక వర్గాల్లో ఒకటి ఎస్సీ రిజర్వు అయ్యే అవకాశం వుంది. ఇప్పటికే 3 ఎస్సీ రిజర్వు స్థానాలు వున్నాయి. మాచెర్ల, వినుకొండ లలో ఒకటి ఎస్టీ అయ్యే అవకాసం వుంది. ప్రత్తిపాడు జనరల్ అయితే పొన్నూరు ఎస్సీ రిజర్వు అయ్యే అవకాశం వుంది, నియోజకవర్గాల పునర్విభజన ఖరారు కావటం తో రాజకీయ ఆశావాహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.