అఫక్ అలీ అలియాస్ మున్న, Etawah జిల్లలో నివసించే ఈ 55 ఏళ్ళ ముసల్మాన్ ఆవులు అంటే అమితమైన ఇష్టం. అయన పదిహేనేళ్ల వయసున్నప్పటి నుంచి ఆవులంటే అమితమైన ప్రేమ. తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి అయింది. అయన భార్యకు ఆవులు అంటే చిరాకు అంట, ఆవులు ఇంట్లో ఉంచటం ఇష్టం లేదు. ఆవులని అమ్మయేమని రోజు గొడవ పాడేది. మున్నా మాత్రం ససేమీరా అనేవాడు. ఒక రోజు గొడవ పెద్దది అయింది. అయన భార్య ‘నీకు ఆవులు కావాలో నేను కావాలో తేల్చుకో’ అని చెప్పింది. మున్నా నాకు ఆవులే కావాలి అని చెప్పాడు. దీంతో అయన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ ఘటన జరిగి 13 ఏళ్ళు. ఇప్పటికి భార్య తిరిగి రాలేదు. కాని మున్నా 14 ఆవులతో తనకి ఇష్టమైన పని చేస్తుకుంటూ ఆవుల్ని సంరక్షిస్తున్నారు. ఇటీవల కొన్ని గో సంరక్షణ సంస్థలు వారిపై దాడులు చేస్తున్న నేపథ్యంలో మున్నా తన కథను మీడియాతో పంచుకున్నారు. ‘నేను నా భార్యను వదులుకుంది మరో స్త్రీ కోసం కాదు. ఆవుల కోసం..’ అని గర్వంగా చెప్పాడు.
55 ఏళ్లలోనూ ఆవులకు ఆయన చేస్తున్న సేవ ప్రశంసనీయమన్నారు. గోమాతను అమ్మగా చూసే మన దేశంలో, ఇలాంటి ఘటనలు ఏంతో ఊరటను ఇస్తాయు.