virat kohli at stamford bridge 25032016

విరాట్ కోహ్లీ, చాలా కొద్ది వ్యవధిలో, సచిన్ అంత పేరు తెచ్చుకున్నాడు, క్రికెట్లో. యవతను ప్రస్తుతం కోహ్లీ మానియా ఊపేస్తుంది. 27 ఏళ్ల కోహ్లీ ఏంతో దూకుడుతో ప్రత్యర్ధిని గడగడలాడిస్తాడు. అలాంటి కోహ్లికి ఒక విషాద గాధ ఉంది. దానికి రిలేటెడ్ గా అతను దరించే జర్సీ నంబర్ 18 వెనుకు ఉన్న కధ ఇది.

విరాట్ కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ. అందరిలాగే అతనికి నాన్న అంటే అమితమైన ఇష్టం. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లి, తండ్రి సూచనలు తెసుకునేవాడు. విరాట్ ను భారత జట్టు ఆటగాడిగా చూడాలని కోరిక. విరాట్ కు అప్పుడు 18 ఏళ్ళు, 2006లో డిల్లి తరుపున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. కాని పిడుగులాంటి వార్త, తండ్రి చనిపోయాడు అని కబురు వచ్చింది. కాని మ్యాచ్ మధ్యలో ఉంది, అతని టీం క్లిష్ట పర్తిస్తితిలో ఉంది. ఒక పక్క తండ్రి అంత్యక్రియలకు హాజరుకమ్మని ఫోన్స్, మరో పక్క మ్యాచ్. కోహ్లికి తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. తండ్రి ఆశయాన్ని నిలబెట్టటానికి, మ్యాచ్ అడతతానికి నిర్ణయించుకుని, బాధని దిగమింగి, బాటింగ్ కు దిగాడు. 90 పరుగలు చేసి, తన టీం ని ఫాలో ఆన్ నుండి గట్టెక్కించాడు. ఆ వెంటనే కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

తండ్రి మరణించినపుడు కోహ్లీ వయసు ‘18’. అందుకే తన పద్దెనిమిదో వ ఏట తండ్రి మరణించాడని గుర్తుగా కోహ్లీ ఎప్పుడూ ‘18’ నంబర్ జర్సీ నే ధరిస్తుంటాడు.
అలాగే మన క్రికెటర్స్ లో , సచిన్ 10, ద్రావిడ్ 19, గంగూలీ 99, ధోని 7, సెహ్వాగ్ 00 నెంబర్ల జర్సీ నే ధరించేవారు

Advertisements

విరాట్ కోహ్లీ కన్నీటి కథ "నాన్నకు ప్రేమతో", అందుకే జర్సీ నంబర్ ‘18’వేసుకుంటాడు అంట.... Last Updated: 25 March 2016