వల్లభనేని వంశీ, కృష్ణా జిల్లలో ఒక ఊపు ఊపిన యూత్ లీడర్. పార్టీలో వైరి వర్గాన్ని ఎదురుకుని, చంద్రబాబు దెగ్గర మార్కులు కొట్టిన ఎమ్మెల్యే. అమరావతికి, తాత్కాలిక రాజధాని విజయవాడకు గేట్-వే అయిన గన్నవరం నియోజికవర్గనికి ఎమ్మెల్యే అయన వంశీ, తన పనితనంతో నియోజకవర్గ ప్రజలు మన్ననలు అందుకుని ముందుకి సాగుతున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ కుడా వంశీ నియోజికవర్గంలోనే ఉంది. పోలవరం కుడి కాలువ కోసం రైతులని ఒప్పించటంలోను , గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ లోను వంశీ సక్సెస్ అయ్యి మంచి మార్కులు కొట్టేసారు.
అయితే వంశీకి మరిన్ని కష్టాలు అభివ్రుది రూపంలో వచ్చాయి. గన్నవరం నియోజికవర్గంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మొదలుపెట్టింది. అవి అన్ని, వంశీకి తలనొప్పిగా మారాయి. అనేక ప్రాజెక్ట్లలో భూసేకరణ ఇప్పుడు ఇబ్బంది అయ్యింది. ప్రాజెక్టులన్నీ వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆశ ఉన్నప్పటికీ, ప్రాజెక్టులకు భూములు ఇచ్చే రైతులలో అసంతృప్తే వంశీని ఇబ్బంది పెడుతుంది.
- ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం భూసేకరణ
- ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం ఏలూరు కెనాల్ మళ్లింపు
- ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్ల కోసం భూసేకరణ
- బైపాస్ రోడ్డు కోసం భూసేకరణ
- మెట్రోడిపో కోసం నిడమానూరులో భూసేకరణ.
- హైవే విస్తరణ కోసం భూసేకరణ
- మల్లవల్లిలో ఎమ్యూజ్‌మెంట్ పార్క్ కోసం భూసేకరణ
- గన్నవరం-కంకిపాడు మధ్యలో పారిశ్రామిక మండలి కోసం భూసేకరణ
- బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో వ్యవసాయజోన్
అయితే వంశీ మాత్రం చంద్రబాబు, అధికారుల చొరవతో, తను అన్ని సమస్యలు ప్రజలకు చెప్పి, వారిని ఒప్పించి, మంచి package ఇప్పించి, ప్రజల మద్దతతో అన్ని సవ్యంగా పూర్తీ చేస్తాను అనే ధీమాతో ఉన్నారు.