ఇంజనీరింగ్ పూర్తీ చేసుకుని, అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ, డాలర్లు సంపాదిస్తూ కెరీర్ సెట్ చేసుకున్నవాళ్ళు, మన ఆంధ్రలో, ముఖ్యంగా కృష్ణా జిల్లలో ఇంటికి ఒకరు ఉంటారు. అలాంటి కోవలోకే వస్తాడు మన నాగ శ్రీధర్. కాని ఈయన స్టొరీ కొంచెం భిన్నంగా ఉంటది. గూగుల్ లాంటి కంపనీలో పీక్ స్టేజిలో ఉన్నా, ఆయన చేసిన పని, చాల మంది నేటి యువతకు ఆదర్శం.
కటారు నాగ శ్రీధర్, ప్రపంచంలోనే చాలా మంది ఉపయోగించే "గూగుల్ అలర్ట్స్" సృష్టికర్త. కృష్ణా జిల్లా, గంపలగూడెంకి చెందిన మన ఆంధ్రా కుర్రాడు, గూగుల్ లో పని చేసి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని, ఇప్పుడు అమెరికాలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందా, ఈ స్టొరీ చదవండి. CNNకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన కృష్ణా జిల్లా కుర్రాడు చెప్పిన కబుర్లు.
అయన నాన్నగారు స్కూల్ ప్రిన్సిపాల్ అవ్వటంతో, క్రమశిక్షణగా పెరిగాడు. 2000వ సంవత్సరంలో, తన 25వ సంవత్సరంలో, అప్పుడే KLCEలో ఇంజనీరింగ్ చేసి, గూగుల్ లో చేరినప్పుడు, ఉన్న 40 మంది ఇంజనీర్లలో మనవాడు ఒకడు. "గూగుల్ అలర్ట్స్" టూల్ తాయారు చేసినప్పుడు, ముందు తన మేనేజర్ కి నచ్చలేదు అంట. అప్పుడు గూగుల్ ఫౌండర్స్ దెగ్గరకి వెళ్లి, తన టూల్ ని చూపించి, వాళ్ళని ఆకర్షించారు. 2003లో "గూగుల్ అలర్ట్స్" లాంచ్ అయ్యి, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుంది.
అలా 8 ఏళ్ళు గూగుల్ లో పని చేసాక, తనకి ఆ జాబ్ మీద విసుకువచ్చి, కంప్లీట్ గా కొత్త ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. కొన్నాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తీసిన, చివరకి తను కొనుక్కన 320 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 320 ఎకరాల భూమి కొన్నప్పుడు, ఒక 5 ఏళ్ళు ఆగి, అమ్మేద్దాం అనుకున్నాడు అంట. కాని అతనికి మన కృష్ణా జిల్లా పంట పొలాలు, గుర్తుకు వచ్చి, తను కోల్పోయిన ఆనందాన్ని, తను కొనుక్కున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, హయిగా ఉన్నాడు. తనతో పాటు, ఇంకో ఎనిమిది మందికి ఉపాది కల్పిస్తూ సంవత్సారానికి 2.5 మిలియన్ డాలర్లు వ్యవసాయం మీద సంపాదిస్తున్నాడు.
అంతే కాదు, ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చేస్తున్నాడు.