YS జగన్, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లాగైనా చంద్రబాబుని, ఆ ఎనిమిది మంది పార్టీ ఫిరాయించిన MLAలని , దెబ్బ వెయ్యాలి అని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ప్రభుత్వం మీద, స్పీకర్ మీద అవిస్వాసం పెట్టినా, చంద్రబాబు అనుభవం ముందు, జగన్ పాచిక పారలా.
ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించాలని ఉద్దేశంతో జగన్ మరో ఎత్తు వేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తన పార్టీ MLAలు అందరికీ పార్టీ విప్, ఎమ్మెల్యే అమర్‌నాథ రెడ్ విప్ జారీ చేశారు.
పార్టీ ఫిరాయించిన ఆ ఎనిమిది మందికి కూడా, ఎలాగైనా విప్ ఇవ్వాలి అని, ఒకవేళ తప్పించుకోవాలని చూస్తే వారి క్వార్టర్స్‌కు వెళ్లి మరీ విప్ అందజేయాలని, పక్కాగా విప్ అందజేసినట్టు చూపేందుకు సాక్ష్యాలు కూడా ఉండాలి అని జగన్ ఆదేశించారు.
విప్ అందుకుంటే ఆయా పార్టీలకు చెందిన సభ్యులు తప్పనిసరిగా సభకు వచ్చి, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా సభకు రాకపోయినా, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేయకపోయినా సభ్యులపై అనర్హత వేటు పడుతుంది.
మరి ఈ సారి ప్రభుత్వం ఏమి ఎత్తు వేస్తుంది, దానికి జగన్ ఏమి పై ఎత్తు వేస్తాడో, చూడాలి..