అందరిలాగే పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతుంది, తిరుపతి టైలర్స్ కాలనీ కి చెందిన జయశ్రీ. ఆ రోజు రానే వచ్చింది. మార్చ్ 21, మొదటి పరీక్షకు వెళ్ళటానికి సిద్ధం అవుతుంది. "నిమిషం ఆలస్యమైనా రానివ్వరట". అనే తల్లి హెచ్చరికలు ఆమెను తొందరపెడుతున్నాయి. "కనీసం గంట ముందు ఐన్స్టీన్ ఇంటి నుంచి బయలు దేరాలి" అనే టీచర్ల సూచనలు కంగారుపెడుతున్నాయి. ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు సర్దుకుని జయశ్రీ సిద్ధమవుతోంది.
ఇంతలో జరగరాని ఘటన, గుండెను పిండేసే సంఘటన. జయశ్రీ తల్లి, ఇంట్లో కాలుజారి పడిపోయింది. తీవ్రమైన అస్వస్థతతో, ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే కన్నుమూసింది. ఒక్కసారిగా అక్కడ సీన్ మారిపోయింది. కుటుంబసభ్యులు అంతా శోకంలో మునిగిపోయారు.
ఆ చిన్నారికి అప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. అమ్మ చనిపోయింది. ఇప్పుడెలా? పరీక్ష రాయాలా? వద్దా? ప్రాణానికి ప్రాణమైన అమ్మను వదిలి ఎలా వెళ్లాలి? ఏం చేయాలి? ఆమెకు ఏమి అర్ధం కావట్లా. "పరీక్ష బాగా రాయాలిరా జయమ్మా. మాకు మంచి పేరు తేవాల" అంటూ అమ్మ పదే పదే చెప్పే మాటలే గుర్తుకొస్తున్నాయి. అందుకే ఆ జయశ్రీ పెద్ద నిర్ణయం తీసుకుంది. గుండెను రాయ చేసుకుంది. పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. తండ్రి అనుమతితో, పగిలన గుండెతో పరీక్షకు బయలుదేరింది. దుఃఖాన్ని బిగబట్టుకుని పరీక్ష రాసింది. అమ్మకు నిజమైన నివాళి అర్పించింది.
బాధగా ఉన్నా, బెస్ట్ అఫ్ లక్ ఫర్ యువర్ రెస్ట్ అఫ్ లైఫ్, జయశ్రీ.