pattiseema project 27032016

పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా పూర్తి స్థాయిలో దాని సామర్ద్యం 80 టీ ఏం సి తో గోదావరి నీరు కృష్ణ కు ప్రాజెక్ట్ ప్రారంభం లో అనుకున్న సమయం తేది 28-03-2016 కు పూర్తి కావలిసివుంటే, దానికన్నా ముందే తేది 17-03-2016 కే పూర్తి చేయడం విశేషం.

ప్రాజెక్ట్ హైలెట్స్ ఏమంటే :
1) ఆసియా లోనే అతి పెద్ద పంప్ హౌస్ - 24 లిఫ్ట్ పంప్స్ తో 80 టీ ఏం సి కెపాసిటీ.
2) భారత దేశం లో ఈ టెక్నాలజీ వాడడం ఇదే మొట్టమొదటిది.
3) 250 మంది సాంకేతిక నిపుణులు, 1000 మంది సాంకేతిక సిబ్బంది మరియు 2000 మంది ఇతర సిబ్బంది వారి సేవలను అందించారు.
4) ఈ ప్రాజెక్ట్ లో విశేషం ఏమంటే ప్రాజెక్ట్ పనులు నడుస్తున్న సమయం లో నే 4 టీ ఏం సి నీరు ను గోదావరి నుండి కృష్న కు తరలించి కొంతమేర కృష్ణ డెల్టా ను ఆదుకోవడానికిి ఉపయోగపడింది. ఇప్పుడు పూర్తి సామర్ధ్యం 80 టీ ఏం సి నీరు తరలింపు తో గోదావరి - కృష్ణ నదుల అనుసందానం కు సంబందించిన పూర్తి స్థాయి మేలు జరగ బోతుంది. అక్కడి సిబ్బంది స్పష్టంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు ప్రణాళిక - పట్టుదల వల్లనే ఇంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి అవకాశం కల్గింది అని చెప్పడం విశేషం.

jagan praise cbn

ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదా మరియు తెలుగుదేశం సర్కారు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించారా? చంద్రబాబు నాయుడు ను పొగిడేశారా? అన్న భావన తలెత్తేలా తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది.చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడమే లక్ష్యంగా వ్యవహరించే జగన్ అండ్ కో( సాక్షి న్యూస్ ఛానల్ , పేపర్ ) అందుకు భిన్నంగా తొలిసారి వ్యవహరించినట్లు కనిపిస్తుంది.

ఆంద్ర ప్రదేశ్ ప్రజల కలల రాజధాని అయిన అమరావతిలో నిర్మించే కట్టడాలకు సంబంధించి నిపుణుల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన మాక్ నమునాని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్రిక సాక్షి పొగిడేయటమే దీనికి కారణం. రాజ్ పథ్ మాదిరి మాక్ నమూనా ఉందని చెబుతూ.. ఒక పాజిటివ్ స్టోరీ సాక్షిలో రావటం ఆసక్తికరం. చంద్రబాబు నాయుడు అయన ప్రభుత్వం చేసే ప్రతి విషయంలోనూ తప్పులు ఎంచే సాక్షి అందుకు భిన్నంగా.. అమరావతిలో నిర్మించే భవనాల నమూనాపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. నమూనా లో పేర్కొన్న విధంగా పచ్చిక బయళ్లతో. నీటి వనరులు పుష్కలంగా ఉండేలా ఉన్న డిజైన్ పై తన సాక్షి పత్రికలో ‘‘రాజ్ పథ్ లా రాజధాని పరిపాలన భవనాల డిజైన్’’ అంటూ చెప్పటమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

మొత్తం 900 ఎకరాల్లో నిర్మించే నిర్మాణాల్లో 30 శాతం విస్తీర్ణాన్ని పూర్తిగా పచ్చదనానికి కేటాయించారని.. ఐకానిక్ నిర్మాణాలుగా చెబుతున్న రెండు భవనాలు అసెంబ్లీ.. హైకోర్ట్ లకు సంబంధించి.. అసెంబ్లీ భవన నిర్మాణానికే ఏపీ సర్కారు ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని చిన్నపాటి మెలి పెట్టటం కనిపిస్తుంది. ఏమైనా.. జగన్ బ్యాచ్ రాసే ఘాటు కథనాలతో పోల్చినప్పుడు ఈ మెలి పెద్దదేం కాదని చెప్పాలి. ఏమైనా.. మాక్ డిజైన్ పై జగన్ పత్రిక పాజిటివ్ గా రియాక్ట్ కావటం ఆసక్తికర పరిణామం.

hero udai kiran 27032016

చొక్కా విప్పి, ఎగిరి తన్నిన హీరో ఉదయ్ కిరణ్ సిసి ఫుటేజ్ విడుదల

హోటల్‌ దసపల్లాలోని పబ్‌పై బుధవారం దాడి చేసిన 'ఫ్రెండ్స్‌ బుక్‌'‘పరారే’సినిమాల హీరో ఉదయ్ కిరణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. రాత్రి 11.30 ప్రాంతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో, ఉదయ్ కిరణ్ పబ్‌లో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు.

మరోవైపు, తన పైన వచ్చిన ఆరోపణలను ఉదయ్ కిరణ్ కొట్టిపారేశాడు. ఇది అంతా ఒక కుట్ర అని, దీంట్లో కొంతమంది తెలంగాణా రాజకీయనాయకుల పాత్ర ఉంది అంటూ, ఐ లవ్ జగన్, ఐ లవ్ కేసీఆర్, వాళ్ళకి ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తా అని విలేకరులతో చెప్పాడు.

చొక్కా విప్పి, ఎగిరి తన్నిన హీరో ఉదయ్ కిరణ్ సిసి ఫుటేజ్ విడుదల. ఐ లవ్ జగన్, ఐ లవ్ కేసీఆర్.. అంటున్న హీరో ఉదయ్ కిరణ్ వీడియొ ఇదే

{youtube}v3oEb3DLZaQ|500|250|1{/youtube}

mokshu on entry 27032016

నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై నందమూరి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. వందో సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ జరుగనున్నట్టు గతంలో బాలయ్య తెలియజేశారు. అయితే బాలయ్య వందో సినిమా ప్రకటన ఉగాది రోజు వస్తుంది అని సినీ వర్గాల సమాచారం.

ఇకపోతే, బాలయ్యపై ఇండియా టుడే పత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచికలో మోక్షు సినీరంగ ప్రవేశంపై స్పందించాడు. "తాతయ్య, నాన్న బాటలోనే నేనూ సినిమాల్లోకి రావాలనుకుంటున్నా. వారిలానే అభిమానులని అలరిస్తానన్న నమ్మకం ఉంది. నాన్న ఎప్పుడూ నా స్నేహితుడే. ఏ విషయంలోను నన్ను బలవంతం చేయరు. కెరీర్ పరంగానూ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు" అంటూ తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చెప్పాడు మోక్షజ్ఞ. మరి బాలయ్య వందవ సినిమాలో మొక్షు మెరుస్తాడో, లేక సోలో హీరోగా కొత్త సినిమాతో వచ్చి నందమూరి అభిమానులని మెప్పిస్తాడో చూడాలి.

big shock to jagan 27032016

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీని రాజకీయంగా భారీగా నష్టపరుస్తున్నాయని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సీనియర్‌ నేతల విషయంలో అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తీరు పార్టీని బలహీనపరిచే దిశగా తీసుకెళ్తోందని అంటున్నాయి. ‘జగన్ మొండిగా వెళుతున్నారు. రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు వేయడంలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇలాగైతే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని కొందరు విపక్ష ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ ఎన్నిక వ్యవహారం వైసీపిలో ముసలమే తెచ్చింది. చివరి వరకు శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూకే దక్కుతుందని అనుకున్న ఆ పదవిని జగన్‌ కర్నూలు జిల్లా డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇది భరించరాని అవమానమని నెహ్రూ, ఆయన సమీప బంధువు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆగ్రహంతో ఉన్నారు. మూడురోజుల సెలవుల అనంతరం శనివారం శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ నెహ్రూ, సుబ్బారావు సభకు రాలేదు. వారు.. నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. శనివారం నాడు కిర్లంపూడి, గోకవరంలలో కార్యకర్తలను జ్యోతుల కలిశారు. ‘మనకు అవమానం జరుగుతున్న చోట ఇంకా ఎందుకు ఉండడం? వైసీపీని వదిలేయండి’ అని పలువురు కార్యకర్తలు పట్టుబట్టారు.

కిర్లంపూడిలో నెహ్రూ అత్యున్నతంగా గౌరవించే దత్తుడు(సత్యనారాయణమూర్తి) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో అవమానాలు జరుగుతుంటే ఇంకా పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఏముందని జ్యోతులను ప్రశ్నించారు. కాగా.. శనివారం జ్యోతుల, సుబ్బారావు అసెంబ్లీకి రాకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై మాట్లాడుకోవడం కనిపించింది. నెహ్రూ వర్గానికి చెందినవారని భావిస్తున్న రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పత్రికల్లో వచ్చిన కథనాలపై జగనకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ.. తర్వాత మాట్లాడదామని ఆయన అనడంతో.. ఆమె మిన్నకుండిపోయారు. జ్యోతుల వ్యవహారంపై వైసీపీ అధిష్ఠానం ఆలస్యంగా కళ్లుతెరిచింది. అవమాన భారంతో రగులుతున్న ఆయనతో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి రాయబారాలు నడిపారు. కాని ఆ రాయభారాలు ఏవి ఫలించలేదు. జ్యోతుల నెహ్రు మరియు ఆయన సన్నిహిత ఎమ్మేల్యేలు వైసిపి ని వీడటం ఖాయం గా కనిపిస్తుంది.

జగన్ తన మొండి వైఖరి మార్చుకోకపోతే పార్టీ కి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇకనైన తన వైఖరి మార్చుకుంటే మంచిదని వైసిపి నాయకులూ హితవు పలికారు.