ప్రతి నెల మన ఇంట్లో సమస్య...గ్యాస్ వాడు వచ్చి బండ వేసి వెళ్ళినాక, మన ఎకౌంటులో డబ్బులు పడ్డాయో లేదు SMS చెక్ చేసుకుంటూ ఉంటాం. ఆ SMS వచ్చేదాకా నిద్రపట్టదు. టైం కి డబ్బులు పడక పొతే, ఇక టెన్షన్ మొదలవుద్ది. గ్యాస్ వాడికి ఫోన్ చేస్తే బ్యాంకు వాళ్ళని అడగమంటారు. బ్యాంకు వాళ్ళని అడిగితే గ్యాస్ వాళ్ళని అడగమని చెప్తారు. ఏమి చెయ్యాలో తెలియదు, ఎవర్ని అడగాలో తెలీదు. ఇది తెలుసుకోవటం చాలా ఈజీ.
ఈ సమస్య ముఖ్యంగా కొత్తగా బ్యాంకు ఎకౌంటు తెరిసిన వాళ్ళకి, లేకపోతె రెండు ఎకౌంటులు ఉన్నవాళ్ళకి వస్తుంది. మన ఆధార్ నంబర్ జత చేసి ఉంటాం కాబట్టి, ఒకో సారి వేరే ఎకౌంటులో పడుతుంది. కాబట్టి రెండు ఎకౌంటులు చూసుకోవాలి. అది ఏ ఎకౌంటులో పడుతుందో మీ మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు. మొబైల్‌లో*99*99# నొక్కితే, మీ ఆధార్ నంబరు అడుగుతుంది. అంతే మీ ఆధార్ నంబరు చూపిస్తూ అది ఏ బ్యాంకుకు అనుసంధానమైందో.. చివరి సారి ఎప్పుడు రాయితీ పడిందో చెబుతుంది.
అప్పటికీ సమస్య పరిష్కారం అవ్వకపోతే:
18002333555 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదివ్వొచ్చు. తెలుగులో మాట్లాడేవాళ్ళు కుడా ఉంటారు. 18002333555 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి, తెలుగు కోసం 3 నొక్కి ఎంపిక చేసుకోవాలి.. ఆ తరవాత ఏ గ్యాస్ సంస్థ అనేది నంబరు ద్వారా ఇవ్వాలి.. ఇండియన్ గ్యాస్ కోసం 1 నొక్కాలి, హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ) కోసం 2, భారత గ్యాస్ కోసం 3 నొక్కాలి.. ఇప్పుడు రాయితీ సమస్య అయితే 1, ఇతర సమస్యల కోసమైతే 2 నొక్కి వేచి ఉండాలి.. సంబంధిత గ్యాస్ సంస్థ ప్రతినిధి మీతో మాట్లాడుతారు.. మన సమస్య చెప్పి ఫిర్యాదు నంబరు (ఎస్‌ఆర్ నంబరు) తీసుకోవాలి. ఆ నంబరు మన మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంది.