kodali nani 08042016

కృష్ణాజిల్లా గుడివాడ  నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ప్రస్తుతం కృష్ణాజిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ మారాడు. మళ్లీ సొంత గూటి  వైపు కొడాలి నాని చూస్తున్నారని జరుగుతున్న ప్రచారం అప్పుడే తెలుగుదేశంలో సంచలనం రేపుతుంది. నాని 2014 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.అంతకముందు తెలుగుదేశం పార్టీ తరుపున పోటి చేసి 2004 , 2009 ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత వైఎస్ఆర్ సిపి లో జాయిన్ అయ్యి 2014 ఎన్నికల్లో మూడవసారి కూడా గెలుపొందారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తెలుగుదేశం పార్టీలో కొనసాగినట్లైతే.. ఈ రోజు తూర్పు కృష్ణాలో తిరుగులేని నాయకుడిగా ఉండేవారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి ఎన్టీఆర్ కుటుంబంతో ముఖ్యంగా నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. పరిస్థితులు ఏం ప్రేరేపించాయో తెలియదు కాని ఆకస్మాత్తుగా కొడాలి నాని 2014 ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. అయన వెళ్ళే టప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నార చంద్రబాబు నాయుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసిపి లో చెరక ముందే జగన్ ని చంచల్ గూడ జైలు లో కలిసారు. అయితే కొడాలి నాని పార్టీ మారడం జూనియర్ ఎన్టిఆర్ కి కూడా తల నొప్పులు తెచ్చి పెట్టింది. అప్పట్నుంచి తెలుగుదేశం పార్టీకి కొడాలి నానికి మధ్య కృష్ణా జిల్లాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. పార్టీ కార్యాలయం ఖాళి చేఇంచే విషయం లో కూడా పెద్ద వివాదమే జరిగింది.

ఈ మద్య అసలు వార్తల్లో లేని నాని ఒక్కసారిగా బెజవాడలో రాజకీయ వేడి పుట్టించారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ కారులో ఎన్టీఆర్ సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాల ప్రారంభోత్సవానికి ఎంట్రీ ఇవ్వటంతో మీడియా ఫోకస్ నానిపైకి వెళ్లింది. ఇంకేముంది నాని తెలుగుదేశంలోకి వస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది లేదంటూ నాని చెప్పినప్పటికీ, కాదు కాదు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని, దేవినేని ఉమ, బొండా ఉమ, మంత్రి అచ్చెన్నాయుడుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇంకా తెలుగుదేశం పార్టీ నేతలు మరిచిపోలేదని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.నాని ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నేతతో హైద్రాబాద్ లో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగానే తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై చర్చ ప్రారంభమైంది. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల్సిందేనని ఆ నేత బలంగా కోరుకుంటున్నారు.

కొడాలి నాని తెలుగుదేశం పార్టీలోకి వెళితేనే బాగుంటుందని ఆయన అనుచరవర్గం బలంగా కోరుకుంటోంది...వారు ఎంతగా అభిలషిస్తున్నా... తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం నాని చేసిన విమర్శలను పదే పదే గుర్తు చేస్తున్నారు. ఏకంగా చంద్రబాబుపైనే నాని వ్యక్తిగత విమర్శలు చేశారు. అవి అప్పట్లో చంద్రబాబును కూడా తీవ్రంగా బాధించాయి.. దూకుడు మనస్తత్వం, నోటి దురుసు.. రెండు కూడా నానికి రాజకీయంగా క్రేజ్ ను సంపాదించి పెట్టగా....రెండోవైపు అదే స్థాయిలో నష్టాన్ని కూడా తెచ్చిపెట్టాయి. అనుచరవర్గం తెలుగుదేశంలోకి వెళ్లాలని బలంగా కోరుతుండగా, వచ్చేందుకు మాత్రం తెలుగుదేశం నేతలు ససేమిరా అంటున్నారు. విచిత్ర పరిస్థితుల్లో గుడివాడ నాలుగు రోడ్ల కూడలిలో నాని నిలబడిపోయారు. అందుకే రాజకీయ నాయకులకు మాట పెదవి దాటకూడదంటారు. పెదవి దాటని మాట మన సొంతం.. పెదవి దాటిన మాట ప్రజల్లో వెళుతోంది. అదే శాపమై మారుతుంది. చూద్దాం మరి కొడాలి నాని ఇప్పుడేమి చేస్తాడో ...

lokesh 0040622016

తెలుగుదేశం పార్టీలో రాజకీయ మార్పులు జరగనున్నాయా?త్యాగాలు చేసేందుకు నాయకులూ సిద్దమవుతున్నారా?కొట్టాను కోట్లు కర్చు పెట్టి గెలిచి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వీరు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?ఏమిటా నిర్ణయం?తెలుసుకోవాలని ఉందా?అయితే తెలుసుకోండి.

గత కొద్ది కాలంగా తెలుగుదేశంలో విపరీతంగా వినిపిస్తున్న ఒక వార్తని నిజం చేసేందుకు తమ జీవితాలనే పణంగా పెట్టారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్.ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు.గత కొద్ది కాలంగా లోకేష్ ని రాజ్యసభ కి పంపి కేంద్ర మంత్రి చేస్తారని, కాదు కాదు రాష్ట్ర మంత్రి వర్గం లోకే తీసుకుంటారు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే లోకేష్ లాంటి విద్యావంతుడు, దూరద్రుస్తికలవాడు రాజకీయాల్లోకి రావడం మంచిది, రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటు అవుతుంది అని భావించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దానికి అవసరమైతే అయన పదవిని త్యాగం చేయడానికి సిద్దమయ్యారు. దీనికి తగ్గట్టుగానే అయన అడుగులు సైతం వేసారు.నియోజకవర్గంలో తానె కాదు ఏ తెలుగుదేశం అభ్యర్ది వచ్చిన నియోజికవర్గ అభివృద్ధి జరుగుతుంది దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తానూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటా అని నియోజకవర్గంలోని ప్రజలు అందరికి హామీ ఇచ్చిన బోడె ప్రసాద్ "నారా లోకేష్" ని మంత్రి వర్గం లో తీసుకోవాలి!! ఈ నినాదం తో శాశనసభ నుండి లోకేష్ ని రంగంలోకి దిగేందుకు వీలుగా బోడె ప్రసాద్ గారు రాజీనామా చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు. నేడు చంద్రబాబు గారిని కలిసి నారా లోకేష్ ను వారి నియోజకవర్గాల నుండి భారీ మెజారిటీతో గెలిపించెoదుకు సిద్ధం అని ఒప్పించేoదుకు కలవబోతున్నారు. అలాగే బోడె ప్రసాద్ దారిలోనే శాశన మండలి నుంచి ఐతే బుద్ధా వెంకన్న గారూ కుడా రాజీనామా చేసేందుకు సిద్దమని ప్రకటించారు. మరి అధింటే వీరి నిర్ణయాన్ని స్వాగతిస్తారా? లేక అనవసర ఆలోచనలు విరమించుకోమని మండలిస్తారా? అనేది చూడాలి.

cbn tirupati 06042016

ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య నగరాల్లో ఒకటైన తిరుపతికి తీపి కబురు. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా తిరుపతిలో ఓ భారీ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ లో భాగంగా రోబోటిక్స్ అండ్ అనలైటిక్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘ఏపీ టెక్ మహీంద్రా ఐఐడీటీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ అనలైటిక్స్ ను ఏర్పాటు చేయబోతోంది. త్వరలోనే తిరుపతిలో అది ఏర్పాటవుతుంది’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు విశాఖపట్నంలోనూ వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు టెక్ మహీంద్రా సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానితో విజయవాడలో సమావేశమైన అనంతరం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు.

తిరుపతిలో టెక్ మహీంద్రా నెలకొల్పబోయే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటయ్యాయి. త్వరలోనే అక్కడ ఐఐటీ కూడా రాబోతోంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ఒకటి. చంద్రబాబు ఈ ఆధ్యాత్మిక నగరంపై బాగానే శ్రద్ధ పెడుతున్నారు.

babu jagjeevan 06042016

ఏపీ రాజధాని అమరావతిలో బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాంతో పాటు భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం ఏ-కన్వెన్షన్‌హాల్‌లో జగ్జీవన్‌రామ్‌ 109వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మాట్లాడుతూ బడుగులకు అండగా నిలిచిన నేత జగ్జీవన్‌రామ్‌ అని కొనియాడారు. ఎన్టీఆర్‌తో జగ్జీవన్‌రామ్‌ సన్నిహితంగా ఉండేవారని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, జగ్జీవన్‌రామ్‌ భవన్‌ను నిర్మించామని సీఎం చెప్పుకొచ్చారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్‌రామ్‌ ఎంతో కృషి చేశారన్నారు. దళిత బిడ్డ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశామని తెలిపారు. పేదరికంలేని సమాజం తేవడమే తన జీవితాశయమని స్పష్టంచేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు కృషి చేస్తున్నానని, పేదలకు న్యాయం చేయడమే టీడీపీ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.ఇప్పటికే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు తాజా గా జగ్జీవన్ రామ్ విగ్రహమ్ కూడా ఏర్పాటు చేస్తానని తెలిపి దళితుల గుండెల్లో చిరస్తాయి గా నిలిచిపోనున్నట్లు అక్కడున్న దళిత ప్రజాప్రతినిధులు చర్చించుకున్నారని సమాచారం.

{youtube}rbEgTEtuK_g|500|250|1{/youtube}

 

hero surya 05042016 1

తమిళ సూపర్ స్టార్ సూర్య రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. అదికూడా మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లలో. సూర్య తన తాజా చిత్రం '24' సినిమా షూటింగ్ కోసం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, ఈడిగపల్లె గ్రామానికి సోమవారం వచ్చాడు. రాత్రి పొద్దుపోయే దాక షూటింగులో పాల్గొన్నాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో సూర్య మదనపల్లెకు బయలుదేరాడు.

మార్గమధ్యలో వలసపల్లె అనే గ్రామం వద్ద ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక మహిళ తీవ్ర గాయాలు అయ్యి రోడ్డుపై పడి ఉంది. ఆమె రోడ్డుపై పడి ఉండటాన్నిగమనించిన హీరో సూర్య, ఆమెను తన వాహనంలో ఎక్కించుకొని, చికిత్స నిమిత్తం తిరుపతి తరలించారు. మదనపల్లె చేరుకున్నాక కుడా ఆ మహిళ పరిస్థితిపై ఆరా తీశారు.

మానవత్వం చాటుకున్నాహీరో సూర్య రియల్ లైఫ్ హీరో అని అక్కడ ప్రజలు మెచ్చుకున్నారు.