jagan assembly 23032016

YS జగన్, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లాగైనా చంద్రబాబుని, ఆ ఎనిమిది మంది పార్టీ ఫిరాయించిన MLAలని , దెబ్బ వెయ్యాలి అని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ప్రభుత్వం మీద, స్పీకర్ మీద అవిస్వాసం పెట్టినా, చంద్రబాబు అనుభవం ముందు, జగన్ పాచిక పారలా.

ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించాలని ఉద్దేశంతో జగన్ మరో ఎత్తు వేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తన పార్టీ MLAలు అందరికీ పార్టీ విప్, ఎమ్మెల్యే అమర్‌నాథ రెడ్ విప్ జారీ చేశారు.

పార్టీ ఫిరాయించిన ఆ ఎనిమిది మందికి కూడా, ఎలాగైనా విప్ ఇవ్వాలి అని, ఒకవేళ తప్పించుకోవాలని చూస్తే వారి క్వార్టర్స్‌‌కు వెళ్లి మరీ విప్ అందజేయాలని, పక్కాగా విప్ అందజేసినట్టు చూపేందుకు సాక్ష్యాలు కూడా ఉండాలి అని జగన్ ఆదేశించారు.

విప్ అందుకుంటే ఆయా పార్టీలకు చెందిన సభ్యులు తప్పనిసరిగా సభకు వచ్చి, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా సభకు రాకపోయినా, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేయకపోయినా సభ్యులపై అనర్హత వేటు పడుతుంది.

మరి ఈ సారి ప్రభుత్వం ఏమి ఎత్తు వేస్తుంది, దానికి జగన్ ఏమి పై ఎత్తు వేస్తాడో, చూడాలి..

airflight bird 1

మార్చి 11న ఈజిప్ట్‌ఎయిర్ ఫ్లైట్ 71 మంది ప్రయాణికులతో, కైరో నుంచి లండన్ బయలుదేరింది. విమానం లండన్ లో ల్యాండ్ అవ్వటానికి రెడీ అవుతుంది. ఇంతలో గగన తలంలో విహరిస్తున్న ఆ విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంట వచ్చి ఆగిపాయింది. Heathrow Airport లో విమానం ల్యాండైన తర్వాత ఏమైందా అని చూస్తే ఆ పక్షి గుద్దిన చోట పెద్ద రంధ్రం ఏర్పడింది. దాదాపు 30సెం.మీటర్ల మేర ఈ రంధ్రం పడింది. అయితే విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ సంఘటన తర్వాత విమానాన్ని బాగుచెయ్యటానికి, ఇంజనీర్లకు 21 గంటల సమయం పట్టింది

airflight bird 2

airflight bird 3

 

lok satta jp 22032016

లోక్ సత్తా పార్టీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయదని ఆ పార్టీ అధినేత వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... ఇకపై పార్టీలకు అతీతంగా ప్రజాసంక్షేమం కోసం పాటుపడతామని తెలిపారు.  రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు అధికారం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం కోసం నిరంతరం పోరాటం సాగిస్తామన్నారు.

tirupati jayasree 22032016

అందరిలాగే పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతుంది, తిరుపతి టైలర్స్ కాలనీ కి చెందిన జయశ్రీ. ఆ రోజు రానే వచ్చింది. మార్చ్ 21, మొదటి పరీక్షకు వెళ్ళటానికి సిద్ధం అవుతుంది. "నిమిషం ఆలస్యమైనా రానివ్వరట". అనే తల్లి హెచ్చరికలు ఆమెను తొందరపెడుతున్నాయి. "కనీసం గంట ముందు ఐన్స్టీన్ ఇంటి నుంచి బయలు దేరాలి" అనే టీచర్ల సూచనలు కంగారుపెడుతున్నాయి. ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు సర్దుకుని జయశ్రీ సిద్ధమవుతోంది.

ఇంతలో జరగరాని ఘటన, గుండెను పిండేసే సంఘటన. జయశ్రీ తల్లి, ఇంట్లో కాలుజారి పడిపోయింది. తీవ్రమైన అస్వస్థతతో, ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే కన్నుమూసింది. ఒక్కసారిగా అక్కడ సీన్ మారిపోయింది. కుటుంబసభ్యులు అంతా శోకంలో మునిగిపోయారు.

ఆ చిన్నారికి అప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. అమ్మ చనిపోయింది. ఇప్పుడెలా? పరీక్ష రాయాలా? వద్దా? ప్రాణానికి ప్రాణమైన అమ్మను వదిలి ఎలా వెళ్లాలి? ఏం చేయాలి? ఆమెకు ఏమి అర్ధం కావట్లా. "పరీక్ష బాగా రాయాలిరా జయమ్మా. మాకు మంచి పేరు తేవాల" అంటూ అమ్మ పదే పదే చెప్పే మాటలే గుర్తుకొస్తున్నాయి. అందుకే ఆ జయశ్రీ పెద్ద నిర్ణయం తీసుకుంది. గుండెను రాయ చేసుకుంది. పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. తండ్రి అనుమతితో, పగిలన గుండెతో పరీక్షకు బయలుదేరింది. దుఃఖాన్ని బిగబట్టుకుని పరీక్ష రాసింది. అమ్మకు నిజమైన నివాళి అర్పించింది.

బాధగా ఉన్నా, బెస్ట్ అఫ్ లక్ ఫర్ యువర్ రెస్ట్ అఫ్ లైఫ్, జయశ్రీ.

tv record 22032016

మనం టివీని కాలక్షేపం కోసం చూస్తూ ఉంటాం. కాని ఆస్ట్రియ రాజధానికి వియన్నాకు చెందిన నలుగురు యువకులు ,ఒక యువతి నిర్విరామంగా 92 గంటలపాటు టివీని చుస్తూ గిన్నీసు రికార్డులకెక్కారు. ఆ యువత వినూత్నంగా ఆలోచించి ప్రపంచ రికార్డును సృష్టించారు. మర్తిజ్ ఆర్నాల్డ్ సమక్షంలో ఏకంగా 92 గంటల పాటు టివీ చూసి రికార్డ్ స్సృస్తించారు.

వారు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి గంటకి ఒక 5 నిముషాలు విరామం ఇచ్చారు. వారి భోజనం , ఇతర పనులన్నీ ఆ 5 నిముషాల్లోనే ముగిచ్చాలి అని షరతు పెట్టారు . కాని నిద్ర మాత్రం మానుకొని ఆ యువత ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.