ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైసీపీ, బీజేపీ నేతల మధ్య, రోజుకి ఒక వివాదం రేగుతూ, ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుంది. నిన్నటి దాకా, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసుకుంటూ, విజయసాయి రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కన్నా లక్ష్మీ నారయణ, సుజనా చౌదరి, పురందేశ్వరి పై తీవ్ర ఆరోపణలు చేసారు. దాదపుగా నాలుగు రోజుల పాటు, ఇరు పార్టీల నేతలకు మాటా మాటా నడించింది. ఇది ఎక్కడ వరకు వెళ్ళింది అంటే, బీజేపీ హైకమాండ్ కూడా, ఎంటర్ అయ్యి, జరుగుతున్న విషయం పై ఆరా తీసింది. రాష్ట్ర బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గున్న హైకమాండ్ నేతలు, వైసీపీ చేస్తున్న అన్ని ప్రజా వ్యతిరేక పనుల పై, నిలదియ్యాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలా చెప్పి ఒక్క రోజు అయ్యిందో లేదో, ఇప్పుడు మరో బీజేపీ నేతను టార్గెట్ చేసింది, జగన్ ప్రభుత్వం. నిబంధనలు సాకుగా చూపి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి షాక్ ఇచ్చారు పోలీసులు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆక్టివ్ గా ఉండే నేత, విష్ణువర్థన్‌‌రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. విష్ణువర్థన్‌‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు, ఆయన్ను 28 రోజుల పాటు, బయటకు రాకూడదు అని, హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను విష్ణువర్థన్‌‌రెడ్డి ఇంటికి వచ్చి, పోలీసులు ఇచ్చి వెళ్లారు. విష్ణువర్థన్‌‌రెడ్డి కర్నూల్ జిల్లాకు వెళ్లి రావటమే కారణంగా పోలీసులు చెప్తున్నారు. కర్నూల్ లో కేసులు అధికంగా ఉండటంతో, అక్కడకి వెళ్లి రావటంతో, ఈ నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. నిబంధనలు పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే, తీవ్ర చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదే విషయాన్ని విష్ణువర్థన్‌‌రెడ్డికి తెలిపారు పోలీసులు.

అయితే ఈ నోటీసుల పై, బీజేపీ భగ్గు మంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులు లేవనెత్తుతున్నందుకు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఈ విషయం పై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాకు హోంక్వారంటైన్ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేసారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, "నాకు కేంద్ర సహాయమంత్రి హోదా ఉంటుంది, దేశంలో ఎక్కడైనా తిరిగే వెసులుబాటు నాకుంది. కొందరు అవగాహన లేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. స్థానిక సీఐ, ఎస్ఐలు వారికి తెలియక నోటీసులు ఇచ్చారు. 24 గంటల పాటు నాకు సెక్యూరిటీ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాకు భద్రత కల్పిస్తాయి. అధికార పార్టీ నేతలు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్న వైసీపీ మంత్రుల్ని క్వారంటైన్ లో పెడతారా?: అంటూ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read