వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకుంటునట్టు ఉన్నారు... జగన్ అధికారుల మీద ఎలా చిందులు వేస్తున్నారో, చూస్తూనే ఉన్నాం... ఆఖరకి కలెక్టర్ ని కూడా జైలుకి తీసుకుపోతా అన్న మాటలు విన్నాం. అయితే, ఇప్పుడు తమ నాయకుడు జగన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, వారి పార్టీ ఎమ్మెల్యేలు.నిన్న చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ప్రమాదం విషయంలో ఇదే రకంగా ప్రవర్తించారు, వైసీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఆ మహిళా ఎస్పీ, పోలీస్ పవర్ ఏంటో చూపించారు.
విషయంలోకి వెళ్తే, నిన్న చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన లారీ ప్రమాదం తర్వాత క్షతగాత్రులని, మృతి చెందిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని పరామర్శించడానికి వైసీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, ఇతర నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే ఉన్న చిత్తూరు ఎస్పీ జయలక్ష్మి తమకు సమాధానం చెప్పాలి అని వారు పట్టు బట్టారు. సంఘటనా స్థలంలో తానూ ఉన్నానని ఇది సాధారణ ఆక్సిడెంట్ అని, దీని పై రాద్దాంతం చేయద్దని అనడంతో, వైసీపీ ఎమ్మెల్యే నువ్వు అధికార పార్టీకి తొత్తుగా మారవని ఎస్పీ పై విరుచుకు పడ్డారు.
దీంతో ఎస్పీ, అదే రీతిలో వైసీపీ ఎమ్మెల్యేకి సమాధానం ఇచ్చారు. మా విధులకు ఆటంకం కలిగించకుండా పక్కకి తప్పుకోవాలని ఆమె వారిని కోరారు. అయినా వైసీపీ నాయకులు అడ్డుతగలి వాగ్వాదానికి దిగారు. దీంతో జయలక్ష్మి మీకు మానవత్వం లేదా, చనిపోయిన వారిని చూడడానికి వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారా? గెటౌట్ ఇక్కడ ఉండద్దు అని అనడంతో వైసీపీ నాయకులు సంయమనం కోల్పోయారు. ఒకానొక దశలో పరస్పరం యూజ్ లెస్ అని తిట్టుకున్నారు. అయితే ఆమె పక్కనున్న బాడీ గార్డ్లు అడ్డుకుని ఎమ్మెల్యే ని అక్కడి నుండి పంపించి వేశారు.