మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. నంబూరి శేషగిరిరావు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లొద్దని ఆదేశించింది. కేవలం కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఏపీ హైకోర్టు, పిన్నెల్లిని ఈనెల 6 వరకు అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేయగా, ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు ఉపశమనం కల్పించడం హైకోర్టు చేసిన తప్పు అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
Advertisements