ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా పాజిటివ్ కేసుల పుట్టలు బద్దలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా, గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో క-రో-నా పాజిటివ్ కేసులు సంఖ్య 1016కు చేరుకుంది. గత 24 గంటల్లో క-రో-నా-తో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. మోత్తం కరోనా మృతుల సంఖ్య 31కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకుని 171 మంది డిచ్చార్జ్ అయ్యారు. అయితే, ఇప్పుడు అందరినీ కలవర పెట్టే విషయం ఏమిటి అంటే, శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు కరోనా పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. ఇన్నాళ్ళు ఎక్కడో ఊరికి దూరంగా, వారి బ్రతుకు వాళ్ళు బ్రతుకుంటే, ఇప్పుడు కరోనా కేసులు రావటం, సంచలనంగా మారింది. గడిచిన 40 రోజుల్లో లాక్ డౌన్ ఉన్నా, ఫారన్ కేసులు లేకపోయినా, ఢిల్లీ కేసులు లేకపోయినా, కరోనా ఎలా వచ్చిందో ఏమిటో అనే విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు. మరో పక్క, 40 రోజులుగా లాక్ డౌన్ ఉన్నా కూడా, అక్కడ ఇప్పుడు కేసులు వస్తున్నాయి అంటే, అది పాలక పక్షం అసమర్ధత వల్లే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గ్రీన్ జోన్ లో ఉన్న జిల్లాలకు, రెడ్ జోన్ నుంచి కొంత మంది అధికార పార్టీ నేతలు వచ్చి వెళ్ళటంతోనే, ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఎక్కడో శ్రీకాకుళం నుంచి, 7 జిల్లాలు దాటుకుని, అధికార పార్టీ నేతలు, అమరావతి వచ్చి వెళ్తున్నారని, అందుకే ప్రశాంతంగా ఎక్కడో ఉన్న శ్రీకాకుళం జిల్లాలకు కూడా, అధికార పార్టీ నేతల అసమర్ధత వల్లే, ఈ పరిస్థితి వచ్చిందని, ఇది ఇంతటితో ఆగదు అని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి ఏ హోదాలో, హైదరాబాద్, విశాఖపట్నం, తాడేపల్లిలో తిరిగి, శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేస్తారని, ప్రశ్నిస్తున్నారు. అలాగే నిన్న స్పీకర్ తమ్మినేని, ఒక సభ పెట్టటం, అక్కడ ఎక్కడా సామాజిక దూరం పాటించక పోవటం పై, విమర్శలు వస్తున్నాయి.

ఇలా అధికార పార్టీ నేతల నిర్వాకాల వల్లే కర్నూల్, గుంటూరు, శ్రీకాళహస్తిలో,ఈ రోజు ఈ పరిస్థితి ఉందని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో, ఎక్కడో ఒక జిల్లాలో, అక్కడక్కడా కేసులు వస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం, ప్రతి జిల్లాకు కరోనా కేసులు పాకించారు అంటే, ఇది అధికార పక్షం వైఫల్యం కాక ఇంకా ఏమిటి అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, ఇంకా ఎన్నికలు, రాజకీయం చేస్తూ గడుపుతున్నారని వాపోతున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. "వైసీపీ నేతలు లాక్‍డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదు. కరోనా బులెటిన్‍లలో లోపాలు ఉన్నా సరిదిద్దుకోవడం లేదు. కరోనా సమయంలోనూ జగన్ ఎన్నికల గురించి ఆలోచించడం దుర్మార్గం. ఆరు నెలల పాటు ఎన్నికలు ఉండవని ప్రకటన చేయాలి" అని విష్ణు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read