ఒకరి దురదృష్టం, మరొకరి అదృష్టం అని పెద్దలు అంటారు. ఒక మంచి ఆఫీసర్ ని, కేవలం చంద్రబాబు హయంలో బాగా పని చేసారు అనే ఉద్దేశంతో, జగన్ ప్రభుత్వం వదులుకుంటే, కళ్ళకు అడ్డుకుని, మరో కీలక పోస్టింగ్ ఇచ్చి, పదోన్నతి ఇచ్చి మరీ కేంద్ర ప్రభుత్వం, ఉన్నత స్థానం కల్పించింది. ఆ ఆఫీసర్ పేరు జాస్తి కృష్ణ కిషోర్. చంద్రబాబు నాయుడు హయంలో, ఆయన అవినీతి చేసారు అనే ఉద్దేశంతో, జగన్ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. అయితే ఆయన క్యాట్ ట్రిబ్యునల్ కు వెళ్ళటం, అక్కడ సస్పెన్షన్ ఉత్తర్వులు కొట్టేయటంతో, ఆయన తన మాతృసంస్థకు వెళ్ళిపోయారు. దీంతో ఆయనకు కేంద్రం, తాజగా, ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపాల్ కమిషనర్ గా కృష్ణ కిషోర్‌కు, పదోన్నతి ఇచ్చింది కేంద్రం ప్రభుత్వం. కృష్ణ కిషోర్ ని, ఐటి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా ప్రమోషన్ ఇస్తూ, ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ), ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణ కిషోర్ ని, ఢిల్లీ ఐటి శాఖ ప్రధాన కార్యాలయంలో, రిపోర్ట్ చెయ్యాలని, ఆ ఆదేశాల్లో చెప్పింది. దీంతో కృష్ణ కిషోర్ కు పలువురు శుభాకాంక్షలు చెప్పారు. తన హోదాకు తగ్గ పదవి వచ్చింది అంటూ, అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద అవమానాలు పడినా, కేంద్రం గుర్తించి, మంచి పదవి ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి సేవ చేసే అవకాసం వచ్చిందని పలువురు ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు హయంలో, కృష్ణకిషోర్ , ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ గా పని చేసారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవటంలో, ఆయన శాఖ చేసిన పని కూడా ఒక కారణం. అయితే అనూహ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, కృష్ణ కిషోర్ పై అవినీతి ఆరోపణలు మోపి సస్పెండ్ చేసారు.
ఇలాంటి ఆఫీసర్ పై, చర్యలు తీసుకోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన క్యాట్ కు వెళ్ళటంతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కేవలం ఒక సామాజికవర్గం టార్గెట్ గా, ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని, పలువురు ఆరోపించారు కూడా. అయితే క్యాట్ సస్పెన్షన్ రద్దు చేయ్యాటంతో, ఆయన తన మాతృసంస్థ అయిన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. దీంతో కేంద్రం చాలా తక్కువ సమయంలోనే ఆయనకు, ఇప్పుడు పదోన్నతి ఇస్తూ, గౌరవించింది. గతంలో జగన్ ప్రభుత్వం ఆయన్ను అవమానించింది. రిలీవ్ చెయ్యకుండా ఆపింది, అవినీతి ఆరోపణలు మోపి సస్పెండ్ చేసింది. అయినా, అయన అన్నీ తట్టుకుని, ఇప్పుడు దేశంలోనే ఒక అత్యుత్తమ పదవి, ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ లో పొందారు.