ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయలు నడుస్తున్నాయి. తమకు నచ్చకపోతే సస్పెన్షన్, తమను ప్రశ్నిస్తే సస్పెన్షన్ అనే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో చంద్రబాబు హయంలో, మంచి పొజిషన్ లో ఉన్న అధికారులను టార్గెట్ చేసి, వారికి పోస్టింగులు ఇవ్వకుండా, అలాగే వారిని తక్కువ హోదా పోస్టులు ఇస్తే, ఇంకా కొంత మంది అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహిస్తున్న తీరు పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఓక సామజికవర్గ ఆఫీసర్లను టార్గెట్ చేసుకుని వెళ్తున్నారని, ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు గానే, చంద్రబాబు హయంలో కీలక ఆఫీసర్ గా, మంచి పనిమంతుడుగా పేరు ఉన్న జాసి కృష్ణ కిషోర్ ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చెయ్యటం, ఆయన ట్రిబ్యునల్ కు వెళ్లి, సస్పెన్షన్ రద్దు చెయ్యటం, కేంద్రం ఆయనకు పదోన్నతి ఇచ్చి గౌరవించటం తెలిసిందే. అలాగే, చంద్రబాబు హయంలో పని చేసిన, ఇంటలిజెన్స్ డీజీ , ఏబీ వెంకటేశ్వరరావు పై కూడా, ఇలాగే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

అయితే దీని పై ఏబీ వెంకటేశ్వరరావు, హైకోర్ట్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మే నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత, ప్రభుత్వం మారగానే, తన పై కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసిందని కోర్ట్ కు తెలిపారు. అంతే కాకుండా, తనకు జీత, భత్యాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని, కోర్ట్ దృష్టికి తెచ్చారు. తనను కక్ష పూరితంగా, రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెప్పారు. సస్పెన్షన్ కు ముందు కూడా, సర్వీస్ నిబంధనలు పాటించకుండా, అభియోగాలను రూపొందించకుండా, సస్పెండ్ చేసారని చెప్పారు. అంతకు ముందు ప్రభుత్వం మారగానే, బదిలీ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా, జీఏడీలో రిపోర్ట్‌ చేయ్యమన్నారని, తరువాత సస్పెండ్ చేసారని కోర్ట్ ముందు చెప్పారు.

మే 30, 2019 నుంచి తనకు జీతం ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వం తనను అకారణంగా, కక్ష కట్టి సస్పెండ్ చేసిందని, ఆ ఉత్తర్వులు రద్దు చెయ్యాలని, తిరిగి విధుల్లోకి తీసుకొనేలా, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని, అభ్యర్ధిస్తూ, ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ ను విచారణకు తీసుకున్న హైకోర్ట్, పిటిషనర్‌ తరఫు వాదనలు విన్న తరువాత, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం మారితే, ఒక సీనియర్ అధికారిని, ఇలా బదిలీ చేసి, జీతం కూడా ఇవ్వకుండా ఉంచటం మంచిది కాదని కోర్ట్ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహరం పై కౌంటర్ వెయ్యాలని, కేంద్ర హోం కా ర్యదర్శి, ఏపి చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు, హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను, కోర్ట్ పది రోజులకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read