సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎల్జీ పాలిమర్స్ ను సీజ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సుప్రీంను ఆశ్రయించింది. ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా లోపలికి వెళ్లేందుకు ఎల్జీ పాలిమర్స్ అనుమతి కోరింది. ఏడు కమిటీల్లో దేనికి హాజరు కావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎల్జీ తెలిపింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాని హైకోర్టు, వీటి పై పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ప్లాంట్‌ని సందర్శించేందుకు సుప్రీంకోర్టు ఎల్జీ పాలిమర్స్‌కు అవకాశం ఇచ్చింది. 30 మంది కంపెనీ నిపుణుల పేర్లను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
తొలి పిటిషన్‌తో కలిపి వాదనలు జూన్ 8 వ తేదీన వింటామని, అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. పోయిన శుక్రవారం, ఎల్జీ పాలిమర్స్ విషయంలో, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్టేరైన్ ను ఎవరు తరలించమన్నారు ? ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంటూ ప్రశ్నించింది. అలాగే లాక్ డౌన్ తరువాత ఎవరు పర్మిషన్ ఇచ్చారు, కంపెనీ డైరెక్టర్ లో లోపల ఎందుకు తిరుగుతున్నారు, కంపెనీని సీజ్ చెయ్యండి, విచారణ సంస్థలు మాత్రమే లోపలకు వెళ్ళాలి, వాళ్ళు కూడా, రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలి అని హైకోర్ట్ ఆదేశించింది. అయితే దీని పై సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన ఎల్జీ పాలిమర్స్ కు, రిలీఫ్ లభించలేదు, కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.