ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల విక్రయంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపి అని జగన్ చేస్తున్న కార్యక్రమం పై, హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. భూములు విక్రయించి పరిపాలన సాగించే స్థాయికి ప్రభుత్వం దివాళా తీసిందా అని ప్రశ్నించింది. లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వ భూములను ఇ-వేలం విధానంలో విక్రయించడం సరికాదని పేర్కొంది. ఏపిలో భూముల అమ్మకాలపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకో ర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి గాని ఇలా హడావిడి చేస్తూ విక్రయాలుచేయడం ఎంత వరకు సమంజస మని ప్రశ్నించింది. విలువైన భూములు అమ్ము కోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం నడపటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వేల కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న ఎపీలో ప్రజలు ధనవంతులు మాదిరిగా ప్రభుత్వం పేదరికంగా ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ అమలులో ఉంటే ఇంత అర్జెంట్ గా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి వేలం జరపాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ భూములను ఇ-వేలం విధానంలో విక్రయించడం తగదని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ బాబు హైకో ర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

పిటీషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఒక వైపు ఇళ్లస్థలాల కొరకు భూములు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఉన్న భూములను అమ్ముకుంటున్నారు. ఇదేమి పరిస్థితి? అని హైకోర్టు ఆక్షేపించిందని న్యాయవాది శ్రీనివాస రావు తెలిపారు. హైకోర్టు తీర్పు పరిధిలోనే ఈ నెల 28నుండి జరగనున్న ఇ-వేలం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరవున కౌంటరు దాఖలుకు అదనపు అడ్వకేట్ జనరల్ గడు వు కోరడంతో కేసు తదుపరి విచారణను ఈనెల 28కు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read