టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగించేలా ఎల్లోమీడియా ప్రచారం చేసిందని సుబ్బారెడ్డి అన్నారు. వెంకటేశ్వరస్వామికి మేము సేవకులమే అని, కేవలం రాజకీయ వ్యతిరేకతతోనే మా పై నిందలు మోపుతున్నారని అనంరు. వెంకటేశ్వరస్వామికి అపవాదులు తీసుకురావద్దని కోరుతున్నా, తిరుమలపై వార్తలు రాసేటప్పుడు రాజకీయ ప్రయోజనాలు మానేయండి అంటూ మీడియాకు హితవు పలికారు సుబ్బారెడ్డి. ఇక చంద్రబాబు పై కూడా ఆరోపణలు చేసారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 450 ఎకరాలు ఐఎంజీకి దోచిపెట్టారని, మేం అలాంటి పనులు చేయడం లేదని అన్నారు. దేవుడి భూములు, కొట్టేయాలనో అమ్మేయాలనో ఏ రోజూ భావించలేదని, చంద్రబాబు హయాంలో దేవుడి ఆస్తులెన్నో కరిగించేశారని సుబ్బా రెడ్డి అన్నారు.
చెన్నైలోని సదావర్తి భూములు, కనకదుర్గమ్మ భూములు ఎలా కొట్టేయాలని చంద్రబాబు ప్రయత్నించారో మాకు తెలుసు అని అన్నారు. పదివిలో ఉన్నా, లేకున్నా దేవుడి భుముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం అని సుబ్బా రెడ్డి అన్నారు. స్వామికి చెందిన ప్రతి పైసా కాపాడలన్నదే మా ప్రయత్నం, మున్సిపాలిటీ, ప్రభుత్వం చేయాల్సిన పనులకు టీటీడీ డబ్బులా?, చంద్రబాబు హయాంలో తిరుపతిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.400 కోట్లు కేటాయించారు అని అన్నారు. టీటీడీ బాధ్యతలు స్వీకరించగానే నిధుల సంరక్షణ చేపట్టాం అని తెలిపారు.
టీడీపీ హయాంలో చదలవాడ ఛైర్మన్‍గా ఉన్నప్పుడు ఆస్తుల విక్రయం చేసారని, టీటీడీ ఆస్తులను కాపాడటంలో భాగంగానే సమీక్షలు జరిపాం అని, 1974 నుంచి 2014 వరకు వందకుపైగా ఆస్తులు అమ్మారని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న వివాదం పై స్పందిస్తూ, టీటీడీ భూమిల్ని వేలం వేసే నిర్ణయం పూర్తిస్థాయిలో తీసుకోలేదని అన్నారు. గ్రామాల్లో ఒకట్రెండు సెంట్ల టీటీడీ భూముల్ని కాపాడటం కష్టం అని చెప్తూ, భూముల వేలానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందని, అంత వరుకే జరిగింది అని చెప్పారు. మరి ఇంతకీ భూములు అమ్మేస్తారో, లేదో, ఆ రోడ్ మ్యాప్ ఏంటో వేచి చూడాలి. గతంలో చంద్రబాబు అమ్మాలని చూసారు, అని చెప్తూ, తప్పించుకునే ప్రయత్నం చేసారు.