విశాఖ డాక్టర్ సుధాకార్ కేసు విషయంలో మరో ట్విస్ట్ నెలకొంది. మాస్కులు అడిగితే సస్పెండ్ చేసిన దగ్గర నుంచి, అతని కుమారుడు పై కేసు పెట్టటం, తరువాత డాక్టర్ తాగి గొడవ చేస్తున్నారు అంటూ, రోడ్డు మీద పాడేసి కొట్టి, చేతులు కట్టేసి, షర్టు చింపేసి, పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి, చివరకు మెంటల్ హాస్పిటల్ లో చేర్చారు. ఆ తరువాత ఈ కేసుని హైకోర్ట్ తీసుకోవటం, తరువాత సిబిఐకి ఇవ్వటం తెలిసిందే. అయితే ఇప్పటికీ డాక్టర్ సుధాకర్ మెంటల్ హాస్పిటల్ లోనే ఉన్నారు. అక్కడే సుధాకర్ కు హాని చేసే అవకాసం ఉందని, ఆయనకు ఇస్తున్న మందులు పై కూడా అనుమానం ఉంది అంటూ, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో, మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు డా.సుధాకర్‌ ఈ రోజు ఒక లేఖ రాసారు. ఆలాగే, కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసారు. ఆయన లేఖ రాస్తూ, అన్ని వివరాలు ఆ లేఖలో తెలిపారు.

తనకు ఇస్తున్న మందులు గురించి రాస్తూ, ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ మందులు వల్ల తనకు రియాక్షన్ వచ్చింది అని, తన పెదాలు డ్రై అయిపోయాయి అని, అలాగే యూరిన్ ఇబ్బందులు కూడా వచ్చాయని, కంటి చూపు కూడా మందగించింది అని చెప్పారు. ఈ హాస్పిటల్ రామి రెడ్డి అనే డాక్టర్ ఆధ్వర్యంలో నడుస్తుంది అని, మామూలు మనిషి అయిన నాకు, ఇలాంటి డ్రగ్స్ ఇస్తున్నారని అన్నారు. తనను ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ కు మార్చాలని కోరారు. అలాగే ఈ లేఖలో తాను, ఏ పరిస్థితిలో సస్పెండ్ అయ్యింది, ఈ హాస్పిటల్ లో ఎలా చేర్చింది అనేది, వివరించారు. కుటుంబ సభ్యులు తనని కలవటానికి వచ్చిన సమయంలో, ఈ లేఖ రాసినట్టు అర్ధం అవుతుంది. మరి ఈ లేఖ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read