రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల సమస్యల పై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని పై శనివారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మీదుగా నడిచి వెళ్తున్న వలస కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కార్మికులను స్వసలాలకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అంతే కాకుండా వారికి నగదు సాయం అందించాలని, ఆహార భద్రత కల్పించాలని ఆదేశించింది. మరోవైపు వలస కార్మికుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తరలించేందుకు అవసరమైన సదుపాయాలను ఆయా ప్రభుత్వాలే కల్పించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు.

చాలా మంది కార్మికులు కాలినడకన సొంతూర్లకు వెళ్తు న్నారని, వారంతా రోడ్లు, రైల్వే ట్రాక్ పై నడిచి వెళ్లకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆహారం తోపాటు అవసరమైన చోట్ల షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు కూడా రాసింది. ఈ నేపథ్యంలో, హైకోర్ట్ తీర్పు, కేంద్రం ఆదేశాలతో, రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. వలస కార్మికుల కోసం బస్సులు నడపాలని జగన్ అధికారులను ఆదేశించారు. కాగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కె.రామకృష్ణహర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు సూచించిన విధంగా వలస కార్మికులను ఆదుకుని, ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న పోలీసులు కార్మికులను కొట్టటం పై, ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరో పక్క, విజయవాడ పటమటలో ఉంటున్న వలస కార్మికుల పై పోలీసుల లాఠీ ఛార్జ్ ను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించారు. వలస కార్మికుల గదుల్లోకి వెళ్లి లాఠీఛార్జి చేయడాన్ని తప్పుబట్టారు. పనుల్లేవు, ఉపాధి లేదు, ఆకలి దప్పులతో అవస్థలు పడుతుంటే... సహాయం చేయాల్సింది పోయి దాడి చేయడం ఏమిటి.? నిన్న ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో కూడా ఇలానే దాడి చేశారు. ఎక్కడెక్కడి నుండో కాలి నడకన స్వస్థలాలకు వెళ్తున్న వారిపై జాలి చూపించకుండా లాఠీ చార్జి చేయడం దుర్మార్గం అన్నారు. కేంద్రం, సుప్రీం కోర్టు సూచనల మేరకు వెంటనే వాళ్లకు భోజనం, వసతి, స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read