గుంటూరు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు రాజభోగం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ అడిగిందే తడవుగా జీవితకాలం నీటి కేటాయింపులు చేసేసింది ప్రభుత్వం. ఆ కంపెనీని జీవితకాలం నీటిని వాడుకునే హక్కును ధారాదత్తం చేస్తూ ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ళ పాటు, ఏడాదికి 0.0689 టిఎంసీల జలాలను వాడుకునేలా 2019 డిసెంబర్ 3న జీవో ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అయితే తాజాగా జీవితకాలం నీటిని వాడుకునే హక్కు కల్పించాలంటూ, 2020 మార్చ 2న ప్రభుత్వానికి, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ లేఖ రాసింది. లేఖ రాసిందే తడవుగా, అఘమీఘాల పై జీవిత కాల హక్కును కల్పిస్తూ, ప్రభుత్వం మే, 15న జీవో నెంబర్ 81 ను జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ తీరు పై విపక్షాలు మండి పడుతున్నాయి.
తన సొంత కంపెనీకి, ఇలా ఇష్టం వచ్చినట్టు, జీవితకాలం అనుమతులు ఇచ్చే హక్కు జగన్ కు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. అన్ని కంపెనీలు ఇలాగే జీవిత కాలం నీతి కేటాయింపులు అడుగుతాయని, వారికీ కూడా ఇలాగే జీవితకాలం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఈ విషయం పై మండి పడ్డారు. తన సొంత కంపెనీ, తన భార్య డైరెక్టర్ గా ఉన్న కంపెనీకి, అధికారం ఉంది కదా ని జీవిత కాలం నీటి కేటాయింపులు ఇవ్వటం అన్యాయం అని వాపోతున్నారు. ఇదే కంపెనీ గతంలో ఆ ప్రాంతంలో చేసిన అరాచాకాన్ని గుర్తు చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి సంబదించిన సరస్వతి పవర్, జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఈ కంపెనీ తనది అంటూ, అఫిడవిట్ లో కూడా పేర్కొన్నారు. అఫిడవిట్ ప్రకారం జగన్ పేరిట రూ.26.40 కోట్ల విలువ చేసే వాటాలు, ఆయన భార్య పేరిట, రూ.13.80 కోట్ల విలువ చేసే వాటాలు ఉన్నాయని, తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. గత డిసెంబర్ లో ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, కృష్ణాలో వరద ఉన్నప్పుడు, జూన్ నుంచి నవంబర్ మధ్య 0.0689 టిఎంసీల నీటికి వాడుకునే అవకశం ఇస్తే, ఇప్పుడు దాన్ని జీవిత కాలం పొడిగించారు. వెయ్యి గాలేన్లకు రూ.5.50 చొప్పున చెల్లించాలని ఉత్తర్వుల్లో ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమలోనే సిమెంట్ ప్లాంటుకు, పవర్ ప్లాంటుకు దీర్ఘకాలం నీతి అవసరం ఉందని, అందుకే జీవితకాలం నీటిని కేటాయయించినట్టు తెలుస్తుంది. అయితే ఇది తన సొంత కంపెనీ కాబట్టి ఇలా చేసారు, అన్ని కంపెనీలకు ఇదే చేస్తారా అనేది తెలియాలి.