ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా మధ్య మళ్ళీ వాటర్ ఫైట్ మొదలయింది. మళ్ళీ అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, చంద్రబాబు ఉన్న 5 ఏళ్ళు, రాయలసీమకు నీళ్ళు ఇవ్వటానికి, ఆ ప్రాజెక్ట్ అని, ఇదని అదని, ఏదో ఒకటి చేస్తూ ఉండటంతో, తెలంగాణా అభ్యంతరం పెడుతూ ఉండేది. అయినా సరే చంద్రబాబు ముచ్చుమర్రి కట్టారు. పట్టిసీమ కట్టి ఆ నీటిని డెల్టాకి వాడుకుని, కృష్ణా నుంచి వచ్చే నీరు అంతా రాయలసీమకు పంపించారు. ఇలా చంద్రబాబు చేసే ప్రతి ప్రయత్నం కేసీఆర్ అడ్డుకుంటూ ఉండేవారు. అయితే జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, కేసీఆర్, జగన్ ఇద్దరూ మంచి స్నేహితులు అవ్వటంతో, ఈ వివాదాలు ఉండవు అని ఇద్దరూ ప్రకటించుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు వెళ్తే, కేసీఆర్ రాయలసీమను రత్నాల సీమ చేస్తాను అని ప్రకటించారు. అయితే ఏడాది నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవటంతో, కేసీఆర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు.

అయితే, జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోతిరెడ్డిపాడు కాలువలు విస్తరణ చేసుకుంటాం అని చెప్పటంతో, వివాదం మొదలైంది. కనీసం మాకు చెప్పకుండా, ఏపి జీవో ఇచ్చింది అంటూ, తెలంగాణా అంటుంటే, మాకు కేటాయించిన నీళ్ళు మా ఇష్టం అంటూ, ఏపి చెప్పుకొచ్చింది. అయితే, ఈ వివాదం మొత్తం, ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా, అటు తెలంగాణా ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పరస్పరం అక్రమ ప్రాజెక్టులు అంటూ, రివర్ బోర్డు కు ఫిర్యాదు చేసాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమ ప్రాజెక్ట్ అంటూ, కంప్లైంట్ చెయ్యటంతో, అందరూ అవాక్కయ్యారు. ఏ ప్రాజెక్ట్ అయితే, జగన్ వెళ్లి రిబ్బన్ కటింగ్ చేసారో, ఇప్పుడు అదే ప్రాజెక్ట్ అక్రమం అని కంప్లైంట్ చెయ్యటం ఆశ్చర్యం కలిగించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమ ప్రాజెక్ట్ అని, ఏపి రైతాంగం దెబ్బతినే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ కు వెళ్ళవద్దు అని చెప్పినా, అప్పట్లో జగన్ వెళ్లి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేసి, రిబ్బన్ కటింగ్ చేసి, ఫోటోలు దిగి వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం, కాళేశ్వరం అక్రమ ప్రాజెక్ట్ అంటూ ఫిర్యాదు చేసారు. అయితే, ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం, కాళేశ్వరం అక్రమ ప్రాజెక్ట్ కాదని, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డే, ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారని, శిలాఫలకం పై ఆయన పేరు కూడా ఉందని, అప్పట్లో సక్రమం అయిన ప్రాజెక్ట్, ఇప్పుడు అక్రమం ఎలా అవుతుంది, అని తమ వాదనలు వినిపించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే, ఆ రోజు జగన్ చేసిన పనితో, ఇప్పుడు ఏపికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అలా కాకుండా, మరో గట్టి వాదనతో, ఏపి ప్రభుత్వం వచ్చి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆపగలిగితే, జగన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. మరి జగన్ గారు, ఏమి చేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read