రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తొందరపాటు, అవగహన లోపమో, అధికారులు కూడా దూకుడుగా వెళ్ళటమో కాని, కోర్టుల్లో, ట్రిబ్యునల్స్ లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏవో చిన్న చిన్న విషయాలు అయితే అనుకోవచ్చు కానీ, నీటి ప్రాజెక్టులు విషయంలో ఈ తొందరపాటు శాపంగా మారే అవకాసం ఉంటుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టులు ఒక్కసారి కోర్టు మెట్టులు ఎక్కాయి అంటే, ఏళ్ళకు ఏళ్ళు అక్కడే ఉంటాయి, ఇటు ప్రాజెక్టు అంగుళం కూడా కదలదు. అందుకే ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో, అన్ని అనుమతులు తీసుకుని, పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని, ఒక వేళ సమాధానం చెప్పాల్సి వస్తే బలమైన వాదనలు వినిపిస్తూ, ఆ ప్రాజెక్ట్ కల సాకారం చేసుకునే విధంగా మన ప్రణాళికలు ఉండాలి. గతంలో తెలంగాణాతో వివాదాలు ఉన్నా, శ్రీశైలం పై ముచ్చుమర్రి ప్రాజెక్ట్ ను, చంద్రబాబు ఏ వివాదం లేకుండా కట్టారు అంటే, ఇంత పక్కగా వెళ్ళటంతోనే, అన్నే సాఫీగా సాగిపోయి, రాయలసీమకు, మూడు టిఎంసీ నీరు తీసుకునే అవకాశం దక్కింది.
అయితే ఇప్పుడు విషయానికి వస్తే గత కొంత కాలంగా పోతిరెడ్డిపాడు పై వివాదం నడుస్తుంది. అయితే కేసీఆర్ తో స్నేహం ఉంచుకుని, కేవలం వరద జలాలు తీసుకునే విషయంలో, అది కూడా ఒక 15-20 రోజులు మాత్రమే తీసుకునే విషయంలో కూడా, తెలంగణాతో వైరం వచ్చేలా చేసుకుంది ఏపి ప్రభుత్వం. అయితే, ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం పై, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో, ఏపి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పధకం పై, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభుత్వం పై, నాలుగు శాఖల సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటి హైదరాబాద్ కు చెందిన వారితో కమిటీ వెయ్యాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
అన్ని అంశాల పై అధ్యయనం చేసి ఈ కమిటీ రెండు నెలల్లో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జరీ చేసింది. కమిటీ నివేదిక వచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్ట కూడదు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. నారాయణపేటకు చెందిన శ్రీనివాస్, పోతిరెడ్డిపాడు పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు, విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణ నేతృత్వంలోనే బెంచ్, ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసీఆర్ తో స్నేహం ఉంచుకుని, జగన్ మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యంతో, చేసిన పని వల్ల ఇక్కడ వరకు వచ్చిందని, రాయలసీమ పరిస్థితి చెప్పి, మేము తీసుకు వెళ్ళేది, కేవలం వరద జలాలు మాత్రమే, మాకు ఉన్న వాటాలు మాత్రమే తీసుకుతున్నాం అని చెప్తే, అటు వైపు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాసం ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.