చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధ్యమైనంత ఎక్కువ వాడుకుని, అటు ప్రభుత్వ పధకాలు, ఇటు ఉపాధి కూలీలకు డబ్బులు వచ్చేవి. ఈ ఉపాధి హామీ పధకాన్ని వాడుకోవటంలో, చంద్రబాబు ప్రభుత్వం, దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది. పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పని చేసిన లోకేష్, ఈ పధకం పై, ఎక్కువ శ్రద్ధ పెట్టి, కూలీలకు ఎక్కువ పని దినాలు వచ్చేలా చేసి, అటు ఉపాధి కూలీలకు చేతినిండా డబ్బులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పనులు అయ్యేలా చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వంలో, ఈ కార్యక్రమం అంతా, నీరు-చెట్టు పధకం కింద, ఎక్కువ పనులు చేసే వారు. అయితే చివరి ఏడాదిలో చంద్రబాబుతో, రాజకీయ వైరుధ్య వాతావరణం ఉండటంతో, కేంద్రం ఈ ఉపాధి హామీ పనులకు నిధులు ఇవ్వకుండా, ఆపేయటంతో, 2018-2019 సంవత్సరానికి, ఆ నిధులు బాకీ పడ్డాయి. చంద్రబాబు ఎన్ని సార్లు అడిగినా, అప్పట్లో కేంద్రం ఆ నిధులు ఇవ్వలేదు.

అయితే తరువాత ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారటం, జగన్ మోహన్ రెడ్డి రావటం జరిగిపోయాయి. తరువాత, కొన్ని నెలలకు, 2018-2019 సంవత్సరానికి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, కేంద్రం నిధులు విడుదల చేసింది. అయితే, కేంద్రం ఇచ్చిన నిధులు, లబ్దిదారులకు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్ళించింది అంటూ, ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యటం, అలాగే ఈ విషయం పై, కొంత మంది హైకోర్ట్ లో కేసు కూడా వేసారు. ఈ కేసు పై, సోమవారం హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ కేసుని, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. అయితే విచారణ సందర్భంలో, హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వం పై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఉఫాది హామీ నిధులు కేంద్రం ఇస్తే, ఆ నిధులు వాడుకునే అధికారం, దారి మళ్ళించే అధికారం ఎక్కడ ఉంది అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది. నిధులు మళ్లింపు నిజం అని తేలితే మాత్రం, దానికి బాధ్యులు అయిన అధికారులు పై, విచారణకు ఆదేశాలు ఇస్తాం అంటూ, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయం పై, పూర్తి సమాచారంతో, తమకు అఫిడవిట్ దాఖలు చెయ్యాలి అంటూ, హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అఫిడవిట్ దాఖలు చెయ్యాలి అంటూ, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు పై తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది హైకోర్ట్. ఉపాధి హామీ నిధులు మళ్లింపు పై, తదుపరి ఏమి అవుతుంది, రాష్ట్రం ఏమి చెప్తుందో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read