ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి, సాగర్ కుడి కాలువ, హంద్రీ నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపేయాలని ఆదేశించింది. మే నెల వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీరు కంటే, ఎక్కవ వాడుకున్నారని, కృష్ణా బోర్డు రాష్ట్రానికి తెలిపింది. ఇప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కవ వాడుకున్నారు కాబట్టి, సాగర్ కుడి కాలువ, హంద్రీ నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. సాగర్ కుడి కాలువ నుంచి కేటాయించింది 158.255 టీఎంసీ అయితే, ఇప్పటికే 158.264 టీఎంసీల వాడుకున్నారని తెలిపింది. హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి కేటాయించింది, 47.173 టీఎంసీలు అయితే, ఇప్పటికే 48.328 టీఎంసీలు వాడుకున్నట్టు బోర్డు తెలిపింది. ఇప్పటికే నీటిని వాడుకున్నారు కాబట్టి, బోర్డు ఉత్తర్వులు పాటించాలని, ఫిర్యాదులకు అవకాసం ఇవ్వకుండా సహకరించాలని కోరింది.

మరో పక్క కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవో పై బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వివరణ కోరింది. ఈ మేరకు హైదరాబాద్ లో సోమవారం నాడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారుల బృందం భేటీ జరిపింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎదుట నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి అది త్యనాతో పాటు మరో ఇద్దరు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, గోదావరి జలాల వినియోగం విషయంలో తెలంగాణ పై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ మేరకు గోదావరి రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని సమాచారం.

ఎలాంటి డిపిఆర్లు ఇవ్వకుండా అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా తెలంగాణ అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని ఏపీ అధికారులు బోర్డుకు సమర్పించిన లేఖలో పేర్కొ న్నారని విశ్వసనీయంగా తెలిసింది. కాళేశ్వరం 225 టిఎంసీ, సీతారామ 70 టిఎంసీలు, తుపాకులగూడెం 100 టిఎంసీలు ఇలా మొత్తం 450.31 టీఎంసీల నీటి వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించినట్లు తెలిసింది. గోదావరి వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ కింద రాష్ట్రాల ప్రాజెక్టుల పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో చూడకుండా అనేక నిర్మాణాలు చేపట్టిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి నీటి కేటాయింపులు ఫైనల్ కాలేదని తెలిపింది, ఇప్ప టికే కాళేశ్వరం 225 నుంచి 450 టిఎంసీ లకు, సీతారామ 70నుంచి 100 టిఎంసీలకు సామర్యం పెంచినట్లు తెలుస్తుందని వివరణ లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజె క్టులను అడ్డుకోవాలని కోరుతున్నట్లు తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read