ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పై, మరోసారి జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వం, మందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ లో, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలని, తెలుగు మీడియం ఆప్షన్ లేకుండా, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దీని పై కొంత మంది కోర్టకు వెళ్ళిన సంగతి తెలిసిందే. హైకోర్ట్ లో ఈ విషయం పై విచారణ జరిగి, ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం అని, తెలుగు మీడియం కూడా ఉండాల్సిందే అంటూ, హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఈ విషయంలో, ఎందుకో కానీ, తెలుగు మీడియం కూడా ఆప్షన్ పెట్టి, ఇంగ్లీష్ మీడియం పెట్టటానికి ఇష్ట పడటం లేదు. అందుకే మళ్ళీ వాలంటీర్ల చేత, ఒక సర్వే చేపించింది. రాష్ట్రంలో పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, ఏ మీడియం కావాలి అంటూ, సర్వే చేపించారు. ఈ సర్వేలో 90 శాతం మంది, ఇంగ్లీష్ మీడియం కావాలి అంటూ కోరుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది.
ఈ సర్వే చూపించి హైకోర్ట్ లో అపీల్ కు కాని, లేకపోతె సుప్రీమ్ కోర్ట్ కు వెళ్తారని అందరూ భావించారు. అయితే, వాలంటీర్ సర్వే అంటే, ప్రభుత్వ సర్వే నే కాబట్టి, కోర్ట్ ఆ సర్వే ప్రాతిపదికన తీసుకోదు అనుకున్నారో ఏమో కానీ, ఇప్పుడు మరో ప్రముఖ సంస్థతో ధర్డ్ పార్టీ సర్వే చెయ్యాలని, ఏ మీడియం కావాలి అంటూ, ఈ సంస్థ చేత సర్వే చేపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సర్వే వచ్చిన తరువాత, ఈ సర్వే చూపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్ట్ కు వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం అని, అందరూ చెప్తున్న సమయంలో, ఈ సర్వేలు చూపించి, ఆ చట్టం పక్కన పెట్టే తీర్పులు కోర్టులు ఇస్తాయా అనేది ఆలోచించాలి. సింపుల్ గా తెలుగు మీడియం ఆప్షన్ కూడా అయిపోయే దానికి, ప్రభుత్వం ఇంతలా కష్టపడుతుంది.
ఇక మరో పక్క, రాష్ట్రంలో విద్యా రంగంలో చేసిన సంస్కరణలు, తెచ్చిన మార్పులు పై, ఒక ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ చేత, షార్ట్ ఫిల్మ్‌లు తీసి, అవి ప్రచారం చేసేలా అనుమతులు ఇచ్చారు. సమగ్ర శిక్షణా అభియాన్ కింద ఈ షూటింగ్ చేసి, ప్రచారం చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి, ఈ రోజు జీవో 25 రిలీజ్ చేసారు. ఎన్డీటీవీ చేత ఈ సర్వే చేపించి, షార్ట్ ఫిలింలు తియ్యాలని, ప్రభుత్వం ఆ జీవోలో తెలిపింది. ఇది అర్జెంటుగా చెయ్యాలని నిర్ణయం తీసుకోవటంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ జీవోలో చెప్పింది. అయితే దీని కోసం, ఎంత చెల్లిస్తారు, విధివిధానాలు ఏమిటి అనే దాని పై, వివరాలు తెలియాల్సి ఉంది. గతంల్లో ఎన్డీటీవీతో, జగన్ కంపెనీ అయిన సాక్షి టీవీకి లింక్ ఉన్న సంగతి తెలిసిందే.