ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానకులకు ఉహించని షాకు ఇచ్చింది. 24గంటల వ్యవధిలో వరుసగా మద్యం ధరలు పెంచేసింది. మంగళవారం మద్యంధరలను ఏకంగా 50శాతానికి పెంచింది. రాష్ట్రంలో క-రో-నా వైరస్ ప్రభావంతో మద్యం విక్రయాలను 44 రోజులుగా నిలిపివేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ కీలక మార్గదర్శకాలను అనుసరించి సోమవారం నుంచి మద్యం అమ్మకాలను ప్రారంభించి, గ్రీన్, ఆరెంజ్ జోనుల్లోను, రెజోన్లులో కొన్ని జిల్లా లో మాత్రమే మద్యం అమ్మకాలను ప్రారంభించారు. అయితే కేంద్రం మీదకు తోసేస్తున్నా, ఇక్కడ సామాజిక దూరం, ఇతరత్రా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అవి పట్టించుకోలేదు అనే విమర్శలు వచ్చాయి. సోమవారం నుంచి, మద్యం అమ్మకాలు ప్రారంభంకావడంతో దాదావు రాష్ట్రమంతటా అన్ని జిల్లాలో లిక్కరు షాపుల వద్ద పానప్రియులు కిలో మీటర్లు మేర క్యూలు కట్టారు. కొన్ని చోట్ల పోలీసుల ప్రమేయంతో మద్యం ప్రియులు సామాజిక దూరాన్ని పాటించినప్పటికి, దాదాపు అన్ని ప్రాం తాల్లో అందుకు భిన్నంగా మద్యం కోసం పోటే త్తారు.
ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాల వద్ద పరిస్థితుల చక్కదిద్దడం పోలీసులకు సాధ్యం కాని పరిస్థితులు నెలకున్నాయి. దీంతో నిన్న 25శాతం మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం మందు బాబుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో 50శాతం మద్యం ధరలు పెంచింది. ఈ ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. దీంతో మద్యం ధరలు ఒక రోజు వ్యవధిలో 75శాతం పెరిగిన ట్లయ్యింది. రూ. 120 నుంచి రూ. 150 మధ్య ఉన్న క్వార్టర్ ధరపై రూ.80, రూ.150 ఉన్న క్వార్ట రుపై రూ.120 పెంవు, బీర్పై రూ.60, మినీ బీర్‌పై రూ.40 పెంచారు. ఈ పరిణామాల నడుమ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం దుకా ణాలను ఉదయం తెరుచుకోలేదు, పెంచిన ధర లకు అనుగుణంగా రికార్డులు అప్ డేట్ చేసుకునే పనిలో సిబ్బంది వడటంతో అమ్మకాలను ఆరంభించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుందని ప్రకటించారు.
అధికారిక యంత్రాంగం కుడా ఏఏ మోతాదు మద్యం ఎంత ధర పెరిగిందనే పనిలో పడ్డారు. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మద్యం దుకాణాలను తెరవద్దని అధికారులు ఆదేశించినట్లు చెబుతున్నారు. అధికారిక ఉత్తర్వుల జారీ అయ్యేంత వరకు అమ్మకాలను సిబ్బంది ప్రారంభించకపోవడంతో మద్యపాన ప్రియులు ఆయా దుకాణాల వద్ద ఎదురు చూవులు చూసారు. మధ్యాహ్నం 12గంటలు తరువాతగాని షాపులు తెరుచుకోలేదు. అయితే రెండు రోజుల అమ్మకాలు చూస్తూ, దిమ్మ తిరగాల్సిందే. మొదటి రోజు కలెక్షన్ 68 కోట్లు వచ్చింది. మొదటి రోజు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మారు. ఇక రెండు రోజు అయిన నిన్న, చాలా వరకు రేట్లు పెంచినా, చాలా వరకు మధ్యానం నుంచి ప్రారంభం అయినా, నిన్నటి కలెక్షన్ కూడా 40 కోట్లు వరకు వచ్చిందని చెప్తున్నారు. మొత్తంగా, రెండు రోజుల్లోనే, దాదాపుగా, 100 కోట్ల పైన ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.