అధికారంలో ఉంటేనే, ప్రజలు గురించి పట్టించుకునే వారు ఎక్కువ. ఈ మధ్య అది కూడా లేదు. రాజకీయం అలా తయారు అయ్యింది. కాని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల గురించి ఆలోచించే వారు చాలా తక్కువ. అలంటి వారిలో ఒకరు చంద్రబాబు కావటం మన తెలుగు ప్రజలకు గర్వ కారణం. చంద్రబాబు పది పదిహేను రోజుల క్రితం, తాను గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్(జిఎఫ్ ఎస్ టి) అనే ఒక ఫోరం పెట్టినట్టు చెప్పారు. అందులో ఉండే నిపుణులతో చర్చించి, ఈ కరోనా నేపధ్యంలోనే, ఎలా అరికట్టాలి, తరువాత వచ్చే ఆర్ధిక పరమైన విషయాలు ఎలా ఎదుర్కోవాలి, ఇలా అన్ని విషయాల పై కొన్ని సూచనలతో ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. అయితే, అప్పట్లో వైసీపీ పార్టీ దీన్ని విమర్శించింది. చంద్రబాబు అన్నీ ఇలాగే డబ్బా కొట్టుకుంటారు, అక్కడ జరిగిదే ఒకటి ఈయన చెప్పేది ఒకటి అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. కొంత మంది అయితే, అసలు చంద్రబాబుని మోడీ దగ్గరకు కూడా రానివ్వరు, ఈయన ఏదో అబద్ధాలు చెప్తున్నారు అంటూ కొట్టిపారేశారు.
ఇలాంటి సమయంలో రాజకీయం చేసే వారికి, మోడీ, చంద్రబాబు లాంటి వారికి తేడా ఉంటుంది కదా. మోడికి, చంద్రబాబుకి ఎంత పర్సనల్ విరోధం ఉన్నా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సీనియర్ నేతలగా, ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకున్నారు. ఈ రోజు ఇదే విషయం నీతీ అయోగ్ కూడా ప్రశంసించింది. చంద్రబాబుకి ఒక లేఖ రాసింది నీతి అయోగ్. మీరు రాసిన లేఖ, అందులో ఎంతో రీసెర్చ్ చేసి రాసిన అంశాలు, అన్నీ బాగున్నాయి. మీ టీంని అభినందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, ఇలా టెక్నాలజీ, డేటా డ్రివెన్ అప్రోచ్ ని, కరోనా కట్టడిలో ఉపయోగించటాన్ని సమర్ధిస్తుంది. మీరు ఇచ్చిన సూచనలు అన్నీ, స్టడీ చెయ్యమని, మా నీతీ అయోగ్ ప్రతినిధులకు చెప్పం. ముఖ్యంగా మీరు ప్రతిపాదించిన రియల్ టైం డ్యాష్ బోర్డు గురించి తెలుసుకుంటాం. త్వరలోనే మీ రీసెర్చ్ అనెలెటిక్స్ టీం ని వచ్చి, దీని పై చర్చిస్తాం. మీరు ఇచ్చిన సలహాలు సూచనలు, తప్పుకుండా, ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాం అంటూ, ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయం పై గతంలో చంద్రబాబు ఏమి చెప్పారు అంటే, ‘‘అధికారంలో ఉన్నవాళ్లకే బాధ్యత ఉంది, మా ఇష్ట ప్రకారం మేమే చేస్తామనడం’’ కరెక్ట్ కాదు. మేము ఇటీవల సిబిఎన్ ఫౌండేషన్ తరఫున గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్(జిఎఫ్ ఎస్ టి) ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ వ్యాప్తిపై దీనిలో అధ్యయనం చేశాం. పరస్పర విజ్ఞానం, శాస్త్ర సాంకేతికత, అధ్యయనాలు చేస్తున్నాం. వర్ట్యువల్ సమావేశాల ద్వారా వందలాది నిపుణులు, సాంకేతిక వేత్తలు, శాస్త్రవేత్తలతో ప్రతిరోజూ చర్చిస్తున్నాం. వీటన్నింటిపై ఏప్రిల్ ప్రధానికి లేఖ రాశాం. టెస్ట్ లు పెంచాలి, కరోనా రోగులను వేరు చేయాలి, ప్రత్యేక చికిత్స చేయాలి. 14రోజులు ఆప్రాంతంలో ఒక్క కేసు కూడా రాకపోతే ఆ ఏరియాను లాక్ డౌన్ నుంచి మినహాయించండి. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి, వైరస్ తీవ్రతను బట్టి ఎక్కడికక్కడ, దేనికిదానికి కొన్ని నిబంధనలు పెట్టాలని కోరాం. రెడ్ జోన్ లో విధిగా లాక్ డౌన్ అమలు చేయాలని, ఆరెంజ్ జోన్ లో, గ్రీన్ జోన్ లో ఉండాల్సిన సడలింపులపై ఆ లేఖలో సూచనలు ఇచ్చాం. సమాజం పట్ల మనందరికి బాధ్యత ఉంది. 40ఏళ్లుగా ప్రజాజీవితంలో నేను ఉన్నాను. పదిమందితో మాట్లాడాలి, చర్చించాలి, వాటిని విశ్లేషించాలి, ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయాలి. ఈ రోజు ఉదయం 8.30గం కు ప్రధానితో ఫోన్ లో మాట్లాడాను. ఈ సమస్య వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు, లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించాం. ఫౌండేషన్ చర్చలలో వచ్చిన వివిధ నిపుణుల అభిప్రాయాలను ఆయనకు వివరించాను. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, కేంద్రమంత్రులు, నిపుణులతో ఎప్పటికప్పుడు ప్రధాని చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం కూడగడుతున్నారు. ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన అంశం. అధికారంలో ఉన్న ఎవరైనా ఈవిధంగా చర్యలు తీసుకోవాలి, ఏకాభిప్రాయం కూడగట్టాలి. నాకన్నీ తెలుసు అనే అహంభావం మంచిది కాదు. కంటికి కనబడని శత్రువు ఈ వైరస్, దీనికి ఎవరేమిటి అనేది ఉండదు. ఇలాంటి సున్నితమైన అంశంలో ప్రభుత్వాలు, ప్రజలు, సమాజం బాధ్యతగా తీసుకోవాలి. ఎవరికి తోచినవిధంగా వారు సాయపడటం మన బాధ్యతగా తీసుకోవాలి. సాటి మనిషిని ఆదుకోవడం మన బాధ్యతగా, కర్తవ్యంగా భావిద్దాం. " అని అన్నారు.