ఆంధ్రప్రదేశ్ లో కేసులు దూసుకుపోతున్నాయి. ఏపీలో క-రో-నా పాజిటివ్ కేసులు 1,403 కి చేరుకున్నాయి. నేడు కొత్తగా 71 పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 321 మంది డిచ్చార్జ్ కాగా,31 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 1,051 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 43, కృష్ణా 10, గుంటూరు 4, కడప 4, అనంతపురం 3, చిత్తూరు 3, తూ.గో 2, నెల్లూరు జిల్లాలో రెండు పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి రోజు 70 నుంచి 80 కొత్త కేసులు వస్తున్నాయి. అయితే, ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. ఇందుకు అను గుణంగా బుధవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లాక్ డౌన్ నిబంధనలకు సంబంధించి కొన్ని సడలింపులను చేసింది, ఆర్థిక రంగానికి మినహాయింపు కలిగించింది.
ఈ సడలింపులను అనుసరించి లాక్ డౌన్ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు, పవరైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు మినహాయింపు లభించింది. వ్యవసాయరంగం, ఉద్యాన పనులు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ రంగా లకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసుకునేం దుకు మినహాయింపును ఇచ్చింది. వలస కార్మి కులకు రాష్ట్ర వరిధిలోని సొంత ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునేందుకు వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించటంతో, ఏపి ప్రభుత్వం కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే కరోనా లక్షణాలు లేని వారు మాత్రమే పనులు చేయాలని స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, స్టేషనరీ దుకాణాలకు మినహయింవును కల్పించింది. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజరును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, మార్కెటింగ్ కాంప్లెక్స్ లకు అనుమతి లభించింది. కావాల్సిన అనుమతులతో ఈ-కామర్సు కంపెనీలకు, వారు వాడే కార్లుకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్లో కల్పించిన సడలింపుల విషయంలో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అనుసరించి మార్పులు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో నెలకొని పరిస్థితులను గమనించిన తరువాత ఈ సడలింపులను అమలు చేస్తారు. అయితే అన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుంటే, విపరీతంగా పెరిగిపోతున్న కేసుల టైములో, మినహాయింపుల పై విమర్శలు వస్తున్నాయి. కేసులు కంట్రోల్ అయ్యేదాకా, పటిష్టంగా లాక్ డౌన్ పెట్టటమే నయం అని అంటున్నారు.