ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కేసులు పెరిగిపోతూ ఉండటం, సరిహద్దు రాష్ట్రాల్లో కేసులు తగ్గుతూ ఉండటం, కాని ఏపిలో పెరుగుతూ ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలు ప్రకారం, కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానుంది. వస్తున్న సమచారం ప్రకారం, మే 4న ఏపీకి కేంద్ర బృందం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటన చేయ్యనున్నట్టు తెలుస్తుంది. కరోనా ప్రభావం, తాజాపరిస్థితి, లాక్ డౌన్ అమలు తీరు, కరోనా పరీక్షలు జరిగే విధానం, రోగులకు అందే వైద్యంపై కేంద్ర బృందం సమీక్ష చేయ్యనుంది. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే విపక్షాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు దాస్తుందని, టెస్టులు విషయంలో కూడా పీసీఆర్ టెస్టులు చెయ్యకుండా, మాములు రాపిడ్ టెస్టులు చేసి, ఎక్కువ చేసినట్టు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోజు రోజుకీ కేసులు పెరుగుతూ ఉండటం, ఏకంగా గవర్నర్ బంగాళాలో కూడా రావటం పై, ఆందోళన వ్యక్తం చేసారు.

కేంద్రం ఎంటర్ అవ్వాలని, నిజాలు బయటకు చెప్పాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కన్నా కూడా, ఈ విషయం పై, కేంద్రానికి లేఖ రాసారు. అయితే నిన్న కేంద్ర హోం శాఖ సహయమంత్రి కిషన్ రెడ్డి కూడా, కేంద్రం నుంచి టాస్క్ ఫోర్సు, ఏపికి వస్తుందని చెప్పారు. అలాగే, అధికార పార్టీ నేతలకు కూడా చురకలు అంటించారు. కొన్నాళ్ళు బయట తిరగకుండా, సంయమనం పాటించాలని కోరారు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పినట్టే, కేంద్రం బృందం, ఏపి పర్యటనకు వస్తుంది. అయితే ఇది సహజంగా అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే జరుగుతుందా, లేక విపక్షాలు ఆరోపిస్తున్నట్టు, ప్రభుత్వం దాస్తుంది అనే విషయాల పై కూడా, ఏమైనా ఆరా తీస్తారా అనేది చూడాల్సి ఉంది.

ఇక మరో పక్క, వరిస్థితులను అనుగుణంగా గ్రీజోన్లలో మరిన్ని వెసులుబాటులు కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గ్రీజోన్లలో పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుమతిం చామని ఆయన స్పష్టం చేశారు. విమనాలు, రైల్వే ఇప్పుడే నడిచే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగువారిని వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజా రవాణాకు ఇప్పట్లో అవకాశం ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసిందని, అందులో కేంద్రం ఇచ్చిన 5 కేజీలు, రాష్ట్రానికి సంబంధించి 7 కేజీలు ఉన్నాయని ఆయన వివరించారు. బుధవారం నుంచి రెండో విడత బియ్యం వంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిందని తెలిపారు. గుజరాత్ లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వస్థలాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 54 బస్సుల్లో గుజరాత్ నుంచి బుధవారం తెల్లువారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయల్దేరారని చెప్పారు. ఇందుకుసహకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి మత్స్యకారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read