రేపు, మంగళవారం, హైకోర్ట్ లో, మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ విచారణకు రానుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం, ఈ విషయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ పై, ఈ రోజు హైకోర్టులో రిఫ్లై పిటిషన్‍ దాఖలు చేసారు నిమ్మగడ్డ. ఈ సందర్భంగా, ఆ రిప్లై పిటీషన్ లో, పలు సంచలన విషయాలు తెలిపారు నిమ్మగడ్డ. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా, అధికార పార్టీ చేసిన దౌర్జన్యాలు విషయం ప్రస్తావించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత, పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రభుత్వం మాత్రం, ఇవి చాలా తక్కువ చేసి చూపించింది అని, కాని మీడియాలో వచ్చిన కధనాలు కాని, ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులు కాని చాలా అధికంగా ఉన్నాయని అన్నారు. అలాగే ఏకగ్రీవాల విషయం పై కూడా స్పందించారు. ఇన్ని ఏకగ్రీవాలు ఎప్పుడూ జరగలేదని, ఇవి చూస్తుంటేనే, ఎన్నికల ప్రక్రియ సరిగ్గా కొనసాగలేదని అర్ధం అవుతుందని అన్నారు.

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం రెండు శాతం మాత్రమే ఎంపీటీసీ స్థానాలు, ఏకగ్రీవం అయితే, ఈ సారి మాత్రం అది అమాంతం 24 శాతానికి వెళ్లిందని అన్నారు. అలాగే గతంలో ఒకే ఒక జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అయితే, ఇప్పుడు మాత్రం ఏకంగా, 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, ఇది అనూహ్య పరిణామం అని అన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుతంగా జరగలేదు అనటానికి ఇదే నిదర్శనం అని అన్నారు. అందుకే కొన్ని విషయాల పై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అలాగే, తాను ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో, ఎవరితోనే చర్చించాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా ఎన్నికల వాయిదా అనే విషయం పై, అసలు చర్చించాల్సిన అవసరం లేదని కోర్ట్ కు చెప్పారు.

కొన్ని రహస్యంగా చెయ్యాలని, ముందే లీక్ చెయ్యకూడదు అని చెప్పారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తాను కేంద్రానికి లేఖ రాసినట్టు కూడా అఫిడవిట్ లో చెప్పారు. రాష్ట్రంలో, జరుగుతున్న అన్ని పరిణామాల పై, కేంద్రానికి లేఖ రాసానని నిమ్మగడ్డ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు, ఆ లేఖ ఫేక్ అని చెప్తున్న విజయసాయి రెడ్డి అండ్ కో కి గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగా ఆ లేఖ ఫేక్ అని వైసీపీ నమ్ముతుంటే, రేపు ఈ లేఖ పై కూడా కోర్ట్ కు, అది ఫేక్ అని చెప్పొచ్చు. నిమ్మగడ్డ కోర్ట్ కు ఈ విషయం చెప్పారు అంటే, ఆ లేఖ నిజం అనేది వంద శాతం అర్ధం అయిపోతుంది. ఈ కేసు రేపు విచారణకు రానుంది. మరి రేపు కోర్ట్ ఏమి చెప్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read