వైసీపీ పార్టీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. సొంత పార్టీ తప్పు చేసినా ఏకి పారేసి రఘురామకృష్ణ రాజు నైజం అందరికీ తెలిసిందే. ఇసుకలో జరుగుతున్న దోపిడీ, ఇసుక మాఫియా పైన, అలాగే భూకుంబకోణం పైన, డబ్బులు ఇచ్చి పేదలకు భూములు ఇవ్వటం పైన రఘురామకృష్ణం రాజు బాహటంగా ప్రభుత్వం పై విమర్శలు చేసారు. అయితే రెండు రోజుల క్రిందట జరిగిన అచ్చెన్న అరెస్ట్ పై, అన్ని వైపుల నుంచి ప్రభుత్వం పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అచ్చెన్న పై ఎలాంటి అవినీతి ఆధారాలు లేకపోయినా, కావాలని ఇరికించినట్టు తెలుస్తుంది. అయినా ఒక వేళ తప్పు చేసారు అనుకున్నా, ఆయన్ను అరెస్ట్ చేసిన, హింసించిన విధానం పై, ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, 35 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తిని, గోడలు దూకి అరెస్ట్ చెయ్యటం, అలాగే ఆయనకు ఆపరేషన్ అయ్యి 24 గంటలు కూడా గడవక ముందే, 15 గంటలు కారులో ప్రయాణం చేపించి, అరెస్ట్ చేసిన విధానం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ తీరు పై సొంత పార్టీలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ విషయం పై, ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసారు. తప్పు చేస్తే ఎంతటి వారిపైన అయినా చర్యలు తీసుకోవాల్సిందే అని, కాని అచ్చెన్నను అరెస్ట్ చేసిన విధానం మాత్రం సరి కాదని అన్నారు. గోడలు దూకి మరీ అచ్చెన్నను అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉంది అని అన్నారు. అలాగే చంద్రబాబు, అచ్చెన్నను పరామర్శించటానికి వస్తే , ఆయన్ను పంపించక పోవటం కూడా తప్పు అని అన్నారు. ఇది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. అలాగే కోర్టులో ఇచ్చిన రంగుల తీర్పు పై స్పందిస్తూ, అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే అని అన్నారు. తనకు జగన్ మోహన్ రెడ్డిని కలిసే అవకాసం రావటం లేదని, అందుకే ఏదైనా ఉంటే, ఆయన ద్రుష్టికి తీసుకు వెళ్ళటానికి, మీడియాలో చెప్పాల్సి వస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరు, ముగ్గిరికి తప్ప, జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు ఎవరికీ పర్మిషన్ ఉండదు అని అన్నారు. రఘురామకృష్ణం రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read