జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసి అస్మిత్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి పగతో రగిలిపోతున్నారని, రాయలసీమలో, పగ పడితే, ముందు ఆర్ధిక మూలాల పై దెబ్బ కొడతారని, జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే చేస్తున్నారని అన్నారు. తనా మాట వింటే అంతా బాగుంటుంది అని, లేకపోతే ఇలాగే అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని అన్నారు. ప్రకాశంలో సిద్దా రాఘవరావుకి 400 కోట్ల ఫైన్ వేసారని, ఆ ఒత్తిడికి లొంగి పార్టీ మారగానే, మొత్తం పక్కన పోయింది అని అన్నారు. ఇలాగే ఇంకా కొంత మందిని వేధిస్తున్నారని, ఎవరు ఎంత వేదించినా, తన పై ఎంత ఒత్తిడి తెచ్చినా, తాను ఈ పార్టీ మారాను అని, ఆ పార్టీలో చేరను అంటూ జేసి సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినరు అని, ఆయనే రాజు, ఆయనే మంత్రి అంటూ వ్యాఖ్యలు చేసారు. ఎన్ని ఆందోళనలు చేసినా, ఏమి ఉపయోగం ఉండదు అని, ఎదురు ఆందోళన చేసినందుకు, మన మీదే కేసులు పెడతారని, ఇతన్ని ఆపగలిగేది కేవలం నరేంద్ర మోడీ మాత్రమే అని దివాకర్ రెడ్డి అన్నారు. కాని, ఇతను చంద్రబాబుని టచ్ చేస్తే మాత్రం, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది అని అన్నారు. నన్ను కూడా అరెస్ట్ చేస్తారని, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని, కాని తగ్గేది లేదని, దేనికైనా సిద్ధం అని దివాకర్ రెడ్డి అన్నారు.
ఇక మరో పక్క, చంద్రబాబు, జేసి దివాకర్ రెడ్డి కొడుకు, జేసి పవన్ కు ఫోన్ చేసి పరామర్శించారు. జేసి పవన్, చంద్రబాబుతో మాట్లాడుతూ, "ఒక నేరంపై ఎక్కడైనా ఒక కేసు పెడతారు.. అలాంటిది 24 కేసులు పెట్టారు. ఒకటి మినహా అన్నింటిలోనూ బెయిల్ వచ్చింది. మిగిలిన కేసులో కూడా సోమవారం బెయిల్ వస్తుందనే కక్ష కట్టి ఇవాళ అక్రమంగా అరెస్టు చేశారు. ఏ కేసులోనూ, ఎఫ్ఐఆర్ లోనూ ప్రభాకర్ రెడ్డి పేరులేదు. కావాలనే కక్ష సాధింపుతో ఇరికించారు. అస్మిత్ రెడ్డిపై ఏవిధమైన కేసులూ లేవు. అరెస్టుకు ముందే తప్పుడు కేసు బనాయించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనని" చంద్రబాబుకు ఫోన్లో వివరించిన జేసీ పవన్. రేపు అనంతపురం వెళ్లి, జేసి కుటుంబాన్ని, నారా లోకేష్ పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లి, బెంగుళూరు నుంచి అనంతపురం వెళ్లి, జేసి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.