జేసి ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పై, జేసి పవన్ స్పందించారు. ఈ రోజు పెట్టిన మీడియా సమావేశంలో, పూర్తి ఆధారాలు చుపించారు. ఆయన మాట్లాడుతూ "జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన జటాధరా ఇండస్ట్రీస్, చెన్నై కి చెందిన ముత్తు కుమార్ కంపెనీ గౌతం అండ్ కంపెనీ నుంచి 26 వెహికల్స్ కొనుగోలు చేసారు. జటాధరా ఇండస్ట్రీస్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు డైరెక్టరే కాదు. జేసీ ప్రభాకర్ ఉన్న సంస్థకు చెన్నై కే చెందిన వ్యక్తీ వాహనాలు అమ్మితే ,నాగాలాండ్ లో ఏజెంట్ రిజిష్టర్ చేశారు. నాగాలాండ్ లో ఎన్ఓసీ వచ్చింది. మేము వెహికల్స్ కొనుకున్నాం. ఇందులో ఏదైనా తేడా ఉంటే అమ్మిన వాడిని, రిజిస్టర్ చేయించిన వాడిని, ఎన్ఓసి ఇచ్చిన వాడిని అరెస్ట్ చెయ్యాలి కాని, మమ్మల్ని అరెస్ట్ చెయ్యటం ఏమిటి ? ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత, నాగాలాండ్ లో కేసు కూడా పెట్టాం. మేము నాగాలాండ్ లో కేసు పెడితే, ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసారు. జనవరి నుంచి ఒకే కేసు పై, వారానికి ఒక కేసు పెడుతూ, ఇప్పటి దాకా 23 కేసులు పెట్టారు. అన్ని కేసుల పైన బెయిల్ తెచ్చుకున్నాం. మాకు తెలియకుండా మొన్న ఇంకో కేసు పెట్టారు. దాని పై కోర్టుకు వెళ్తే, రేపు సోమవారం వాయిదా పడింది. అందులో కూడా బెయిల్ వచ్చే సమయంలో, అక్రమ అరెస్ట్ చేసారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో జేసి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధమే లేదు. ఇక అస్మిత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసారో కూడా తెలియదు అని జేసి పవన్ అన్నారు. ఎంత వరకు అయినా వెళ్తాం అని, పోరాడతాం అని అన్నారు.
"వైసీపీ నాయకులు చెప్పేవన్నీ అబద్దాలే. జేసీ ప్రభాకర్, అస్మిత్ రెడ్డిలపై సాక్ష్యాలుంటే చూపించడానికి వైసీపీ నేతలు బహిరంగ చాలెంజ్ కి సిద్ధమా ? 24 కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు లేదు. తన సంతకాలు ఫోర్జరీ చేశారని జేసీ ప్రభాకర్ చెబితే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపి పరీక్షించాలి.అస్మిత్ రెడ్డిపై ఒక్క కేసూ లేదు. ఇద్దరిపైనా నిజానిజాలు నిర్దారించుకోవాలి.సాక్ష్యాలుంటే బయటపెట్టాలి. పోలీసులు కొట్టి, బెదిరించి దొంగసాక్ష్యాలు చెప్పించి,దొంగ పత్రాలు సృష్టించి జేసీ ప్రభాకర్ , అస్మిత్ రెడ్డిలపై కేసులు పెట్టారు. జేసీ ప్రభాకర్అన్ని కేసులూ ఒక్కసారే పెట్టాలి. వైసీపీ నేతలు ప్రతిపక్ష నేతలను పార్టీ మారాలని వత్తిడి చేస్తున్నారు. లొంగిన వాళ్ళను పార్టీలో చేర్చుకుంటున్నారు,లొంగని వాళ్లను అరెస్టు చేస్తున్నారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు జేసీ ప్రభాకర్ పై పెట్టిన కేసులు న్యాయస్థానాల్లో అడ్మిట్ కావు,నిలవవు." అని మరో నేత దీపక్ రెడ్డి అన్నారు.