టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, పాల్గొన్న టిడిపి మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు. భార్యాబిడ్డలకు చెప్పకుండా కిడ్నాప్ చేశారు. 300మంది అచ్చెన్న ఇంటిపై దాడి చేశారు. మొన్ననే అచ్చెన్న సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తరువాత ఇంట్లోనే అచ్చెన్నకు వైద్యం. అలాంటి స్థితిలో అర్దరాత్రి కిడ్నాప్ నీచం. మందులు వేసుకోడానికి కూడా అనుమతించలేదు. సీఎం జగన్ శాడిజం పరాకాష్టకు చేరింది. చట్టవిరుద్దంగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కట్టుకథలు చెబుతున్నారు. జగన్ అవినీతిని ఎండగట్టినందుకే అచ్చెన్నపై కక్ష సాధింపు. అసెంబ్లీని ఎదుర్కొలేకే ఇలాంటి దుర్మార్గాలకు తెగించారు. జగన్ ఏడాది పాలనలో అవినీతి కుంభకోణాలు. ఇసుక, మద్యం, గనులు,భూసేకరణలో స్కామ్ లు. వాటిని నిగ్గదీసినందుకే అచ్చెన్నాయుడిపై దాడి అచ్చెన్నాయుడికి ఏమైనా హాని జరిగితే సీఎం జగన్ దే బాధ్యత. అర్ధరాత్రి వందల మందిని పంపి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది..? అచ్చెన్నాయడు ఏమైనా ఉగ్రవాదా..? అచ్చెన్నాయుడి కంపెనీలకు గనులు 50ఏళ్లకు లీజుకిచ్చారా..? అచ్చెన్నాయుడి కంపెనీకి నీళ్లు తీసుకున్నారా..?
మచ్చలేని కుటుంబం అచ్చెన్నాయుడిది. 38ఏళ్ల చరిత్రగల రాజకీయ కుటుంబం అచ్చెన్నాయుడిది. అన్నఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా పనిచేశారు. ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్న కుటుంబం. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి ఉన్న కుటుంబం. శ్రీకాకుళంలోనే కాదు రాష్ర్ంవ్యాప్తంగా అచ్చెన్న కుటుంబానికి ఆదరణ. ఎర్రన్నాయుడి కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసేందుకే అసత్య ఆరోపణలు. రాజకీయంగా ఎదుర్కొలేక దొడ్డిదారిన దొంగదెబ్బ తీస్తున్నారు. 3రోజుల్లో అసెంబ్లీ ఉంటే అచ్చెన్న అరెస్ట్ జగన్ కక్షసాధింపు. బిసిలంటే జగన్ కు మొదటినుంచి కక్ష.. బిసిలపై కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్న అరెస్ట్. బిసి నాయకత్వాన్ని అణగదొక్కడానికే జగన్ కుట్రలు. బీసిల రిజర్వేషన్లను సగానికి కోత పెట్టారు. బిసిల ఇళ్లు ధ్వంసం చేశారు, భూములు బలవంతంగా లాక్కున్నారు. బీసిలపై దాడులు అడ్డుకున్నందుకే అచ్చెన్నపై కక్ష కట్టారు. దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్,హోంమంత్రి, డిజిపి జవాబివ్వాలి. అచ్చెన్న కిడ్నాప్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలి. బిసి సంఘాలంతా ఏకం కావాలి. బిసిలపై వైసిపి దౌర్జన్యకాండను అడ్డుకోవాలి. నల్లజెండాలతో ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలి. అచ్చెన్నాయుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసిలదే. ఈ టెలికాన్ఫరెన్స్ లో మండల పార్టీ అధ్యక్షులు, టిడిపి సీనియర్ నేతలు పాల్గొన్నారు.