ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం పై, ఈ రోజు హైకోర్ట్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియామకం విషయంలో, సంస్కరణలు పేరుతో, నిబంధనలు మారుస్తూ తీసుకోవచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్ట్ కొట్టేసింది. ఈ ఒర్దినన్స్ తెచ్చి, రమేష్ కుమార్ ని తొలగిస్తూ జీవో ఇచ్చి, కనకరాజ్ ను నియమిస్తూ మరో జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇవి కూడా కోర్ట్ రద్దు చేసింది. దీంతో రమేష్ కుమార్ మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియామకం అయ్యారు. ఆర్టికల్ 213 ప్రకారం, ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం, ప్రభుత్వానికి లేదని, కోర్ట్ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై, కోర్టులో ఎదురు దెబ్బ తగలటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి అవగాహన లేక, ఇలా జరుగుతుంది అని, 151 కాదని, 175 సీట్లు వచ్చినా, చట్టాలను గౌరవిస్తూ, ముందుకు వెళ్ళాలని, నాకు బలం ఉంది, నా ఇష్టం అంటే, మన దేశ ప్రజాస్వామ్యంలో కుదరదు అని, చట్టాల ప్రకారం అందరూ నడుచుకోవాల్సిందే అంటూ, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో, జగన్ కు సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది.
వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని స్వాగతించారు. రమేష్ కుమార్ ని, మళ్ళీ పదవిలో తీసుకుంటూ, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు రద్దు చెయ్యటం పై, రఘురామ కృష్ణ రాజు, స్వాగతించారు. హైకోర్ట్ ఇలా చేస్తుంది అని, నాకు ముందుగానే తెలుసు అని, రఘురామ కృష్ణ రాజు అన్నారు. ఈ తీర్పు నాకు అయితే, ఎలాంటి ఆశ్చర్యం కలగించలేదని, ఇలాగే వస్తుంది అని నాకు ముందే తెలుసు అని, రఘురామ కృష్ణం రాజు అన్నారు. గతంలోనే ఇలాంటి విషయాల పై తీర్పులు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగ పదవులకు, పదవీ కాలం తగ్గించేలా ఆర్డినెన్స్ లో చెల్లవు అని గతంలోనే కోర్టులు చెప్పాయని అన్నారు. ఎన్నికల సంస్కరణలు మంచిదే అయినా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం దురదృష్టం అని అన్నారు. నిర్ణయాలు తెసుకునే ముందు, అందరితో సంప్రదించి, తీసుకుంటే మంచిది అని అన్నారు. సొంత పార్టీ నేతలు, ఇష్టం వచ్చినట్టు, హైకోర్ట్ పై మాటలు చెప్పటం దారుణం అని అన్నారు. ఇలాంటి వారిని శిక్షిస్తే తప్పు లేదని అన్నారు.