రేపటికి జగన్ మొహన్ రెడ్డి, గద్దెనెక్కి ఏడాది అవుతుంది. అంటే 365 రోజులు. ఈ 365 రోజుల్లో, 70 సార్లు, అంటే 70 రోజులు కోర్టుల చేత మొట్టికాయలు తిన్నారు అంటే, ప్రభుత్వ పాలన ఎలా ఉందో, ప్రభుత్వంలో ఉన్న వారికి ఎంత అవగహన ఉందో, చట్టాలు అంటే ఎంత అవగాహన ఉందో అర్ధం అవుతుంది. అయితే 70 సార్లు తమని కోర్ట్ అనవసరంగా విమర్శిస్తుంది అని చూస్తున్నారే కానే, జరుగుతున్న తప్పులు మాత్రం తెలుసుకోవటం లేదు. పదే పదే అవే తప్పులు చేస్తూ ఉండటంతో, ఏకంగా చీఫ్ సెక్రటరీ పైనే, కోర్ట్ ధిక్కరణ దాకా వెళ్ళారు. దీంతో కోర్టు తమని, తమ అధినేతను టార్గెట్ చేసింది అంటూ, ఏకంగా కోర్టు పైనే బూతులు తిట్టే స్థాయికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళిపోయారు. కోర్టు ఏదో చంద్రబాబు చెప్తేనే చేస్తుంది అంటూ, కొత్త భాష్యం చెప్తున్నారు. కోర్టు ఏదైనా, చట్టంలో ఏమి ఉందో అది చూసి జడ్జిమెంట్ ఇస్తుంది.
ఎక్కడైనా ప్రభుత్వ భవనాలకు, తమ పార్టీ జెండా రంగులు వేసుకుంటారా ? ప్రభుత్వ భవనాలు అందరికీ సంబంధించినవి, ఒక పార్టీవి కాదు కదా. మరి ఇలాంటి పనులు, చెయ్యవద్దు అని చెప్పినా, పదే పదే చెప్తుంటే కోర్ట్ ఏమి చేస్తుంది ? హైకోర్ట్ ఒక్కటే కాదు కదా, సుప్రీం కోర్ట్ కూడా అదే చెప్పింది కదా. ఇక ఇంగ్లీష్ మీడియం, కోర్ట్ ఏమి చెప్తుంది, నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం ఎందుకు, విద్యా హక్కు చట్టం ప్రకారం, తెలుగు మీడియం ఉండాలి, ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పింది. ఆప్షన్స్ ఇవ్వటానికి, ప్రభుత్వానికి బాధ ఏమిటి ? ఇక డాక్టర్ సుధాకర్ విషయం, వీడియోల్లో స్పష్టంగా పోలీసులు ప్రవర్తించిన తీరు, మాస్కులు అడిగినందుకు సస్పెండ్ ఇవ్వన్నీ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో తేడా ఉంది. విశాఖ పోలీసులు పైనే ఆరోపణలు రావటంతో, సిబిఐకి ఇచ్చారు. ఏ తప్పు చెయ్యనప్పుడు, ఎందుకు భయం ?
ఇక అమరావతిలో ఆడవాళ్ళ పై దాడులు, 144 సెక్షన్ పెట్టి, పోలీసు కవాతులు చేసారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని కోర్ట్ అడిగింది. ఇందులో తప్పు ఏముంది ? మడ అడవులు నరికేస్తుంటే, కోర్ట్ చూస్తూ కూర్చోదు కదా ? 33 వేల ఎకారాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే, కోర్ట్ చూస్తూ కూర్చోదు కదా. అందులోను సీఆర్డీఏ చట్టం ఉంది. ఎల్జీ పాలిమర్స్ లో, గ్యాస్ లీక్ విషయంలో, అందరికీ అనుమానాలు ఉన్నాయి కదా, అదే కోర్ట్ అడిగింది. కరోనా సమయంలో ట్రాక్టర్ ర్యాలీ చేసి, కాళ్ళ మీద పూలు చల్లించుకుంటుంటే, కోర్ట్ నోటీసులు ఇవ్వదా ? ఒక ప్రతిపక్ష నాయకుడుకి, 151 సీఆర్పీసీ నోటీసు, ఏ సందర్భంలో ఇవ్వాలో తెలియదా ? ఉపాధి హామీ నిధులు దారి మళ్లిస్తే, కోర్ట్ అడగడా ? సొంత బాబాయి కేసు సిబిఐకి ఇవ్వమని మీరే కోరారు కదా ? ఒక వర్గం ఆఫీసర్లని అకారణంగా టార్గెట్ చేస్తే, కోర్ట్ కల్పించుకుంటుంది కదా. ఇలాంటివి అనేకం ఉన్నాయి. చేస్తున్న తప్పులు సరి చేసుకోకుండా, చంద్రబాబు మీద, కోర్టుల మీద నెపం నెట్టి తప్పించుకుంటే ఎలా. తప్పు తెలుసుకుని, ముందుకు వెళ్తే, ప్రభుత్వాన్ని ఎవరు ఏమి అంటారు ?